అక్కినేని నాగ చైతన్య, సమంత జంటగా నటించిన సినిమా మజిలీ. శివ నిర్వాణ డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమా ఏప్రిల్ 5 ఉగాదికి ఒకరోజు ముందు రిలీజై సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. మొదటిరోజు నుండి మంచి వసూళ్లను రాబడుతున్న మజిలీ రెండో వారం లోకి అడుగు పెట్టి ఏకంగా 50 కోట్ల గ్రాస్ కలక్షన్స్ సాధించింది.


మజిలీ 50 కోట్ల ప్లస్ నాట్ అవుట్.. సెన్సిబుల్ సమ్మర్ బ్లాక్ బస్టర్ ఆఫ్ 2019 అంటూ షైన్ స్క్రీన్ బ్యానర్ వారు ఎనౌన్స్ చేశారు. నాగ చైతన్య కెరియర్ లో మజిలీ హయ్యెస్ట్ కలెక్టెడ్ మూవీగా క్రేజ్ తెచ్చుకుంది. 21 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ తో రిలీజైన ఈ సినిమాలో పూర్ణ, శ్రావణి పాత్రల్లో అదరగొట్టారు చైతు, సమంత.


ఇక కొన్నాళ్లుగా కెరియర్ లో సరైన హిట్ లేక సతమతమవుతున్న చైతుకి మజిలీ ఓ మెమరబుల్ మూవీగా మిగలనుంది. చైతుతో పాటుగా సమంత ఈ సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకోవడం ప్లస్ అయ్యింది. రియల్ లైఫ్ భార్యా భర్తలు రీల్ లైఫ్ లో కూడా ఆ పాత్రలు చేసేసరికి సినిమాకు ఆడియెన్స్ బాగా కనెక్ట్ అయ్యారు.


మజిలీ వేగం చూస్తుంటే ఇంకా వసూళ్లు బాగానే తెచ్చుకునేలా ఉంది. థియేట్రికల్ రైట్స్ తోనే ఈ రేంజ్ హవా చూపించింది అంటే కచ్చితంగా డిజిటల్, శాటిలైట్ రైట్స్ లో కూడా భారీగానే అమ్ముడయ్యే అవకాశం ఉంది. మజిలీ సినిమా సక్సెస్ నాగ చైతన్య స్టామినా తెలిసేలా చేస్తుంది. ఈ హిట్ తో అందరికన్నా నాగార్జున ఫుల్ హ్యాపీగా ఉంటాడని చెప్పొచ్చు.
 


మరింత సమాచారం తెలుసుకోండి: