పవన్ అభిమానులు ఎంతో ఆతృతతో ఎదురు చూసిన రేణు దేశాయ్ ఇంటర్వ్యూ నిన్న రాత్రి ప్రసారం అయింది. కమెడియన్ అలీ నిర్వహిస్తున్న ‘అలీతో సరదాగా’ కార్యక్రమంలో రేణు దేశాయ్ అనేక ఆసక్తికర ప్రశ్నలకు సమాధానం ఇస్తూ తన పిల్లలు అకిరా ఆధ్యల మనస్తత్వం పై కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసింది. 

అకిరా నందన్ పవన్ కళ్యాణ్ లాగే చాల మొండిమనిషి అనీ ఇంట్లో తాను చేసే వంటల దగ్గర నుండి ప్రతిరోజు తనకు ఏమి కావాలో చాల స్పష్టంగా చెపుతాడనీ ఏవిషయంలో తేడా వచ్చినా సద్దుకోడు అంటూ కామెంట్స్ చేసింది. అదేవిధంగా ఆద్యగురించి మాట్లాడుతూ తన పట్ల ఎంతో ప్రేమగా వ్యవహరించే ఆద్య తన కూతురుగా పుట్టకపోతే తాను ఎప్పుడో చనిపోయి ఉండేదాన్ని అంటూ ఉద్వేగంగా కంట కన్నీరు పెట్టుకుంది రేణు దేశాయ్.

ఇదే సందర్భంలో పవన్ అభిమానుల నుండి తనకు వచ్చే ‘వదిన’ పిలుపు పై స్పందిస్తూ ఆపదం తనకు ఇష్టం అయినా పవన్ వీరాభిమానుల మితిమీరిన అత్యుత్సాహంతో తనకు ఆ ‘వదిన’ పిలుపు పై భయం ఏర్పడింది అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇక తన పెళ్ళి విషయాన్ని వివరిస్తూ తన భర్తకు పూణేలో ఒక సాఫ్ట్ వేర్ కంపెనీ ఉంది అన్న విషయాన్ని వివరిస్తూ అతడి పేరును మాత్రం చెప్పడానికి నిరాకరించింది. 

అయితే ఈ ఇంటర్వ్యూ నిర్వహిస్తున్న అలీ రేణు దేశాయ్ భర్త వాయస్ క్లిపింగ్ ను ఈ కార్యక్రమంలో వినిపించి అందరికీ షాక్ ఇచ్చాడు. ఈ వాయస్ క్లిపింగ్ లో రేణు దేశాయ్ భర్త మాట్లాడుతూ తనకు రేణు లాంటి భార్య దొరకడం తన అదృష్టం అని చెపుతూ రేణు సమర్ధత మంచితనం గురించి ఆకాశానికి ఎత్తేస్తూ ప్రశంసలు కురిపించినప్పుడు ఆనందంతో రేణు కంట కన్నీరు రావడం స్పష్టంగా కనిపించింది. ఈ ఇంటర్వ్యూలో ఎక్కడా పవన్ ప్రస్తావన తీసుకు రాకుండా అలీ వ్యూహాత్మకంగా వ్యవహరించి పవన్ వీరాభిమానుల నుండి నెగిటివ్ కామెంట్స్ రాకుండా చాల జాగ్రత్త పడ్డాడు..  



మరింత సమాచారం తెలుసుకోండి: