లేటెస్ట్ గా మొదలైన అల్లు అర్జున్ త్రివిక్రమ్ ల మూవీ రెగ్యులర్ షూటింగ్ ఈనెల 24 నుండి మొదలు కాబోతున్నట్లు సమాచారం. ఎండలు మండిపోతున్నా ఈమూవీ షూటింగ్ విషయంలో ఎక్కడా రాజీపడకుండా చాల వేగంగా పూర్తి చేయాలని త్రివిక్రమ్ బన్నీలు పట్టుదల పై ఉన్నట్లు సమాచారం. 

ఇలాంటి నేపధ్యంలో ఈ సినిమాకు సంబంధించిన ఒక ఆసక్తికర విషయం లీక్ అయింది. ఈ మూవీలో హీరో తండ్రి విపరీతంగా అబద్ధాలు ఆడే వ్యక్తి అని అతడి కొడుకు తన తండ్రి ఆడే అబద్ధాలను నిజం చేసే ప్రయత్నాలలో పడేపాట్లు నవ్వు తెప్పిస్తాయని సమాచారం. 

అందుకే ఈ మూవీకి ‘నాన్న- నేను’ అనే టైటిల్ త్రివిక్రమ్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. అయితే  బన్నీ సూచన మేరకు ఈ మూవీ స్క్రిప్ట్ మారిందని ఇప్పటికే బన్నీ ‘సన్నాఫ్ సత్యమూర్తి’ ఫాదర్ సెంటిమెంట్ తో చేసినందున తల్లి సెంటిమెంట్ తల్లిపాత్ర కూడ బలంగా ఉండేలా స్క్రిప్ట్ మార్చమని బన్ని కోరడంతో ఈ మూవీ స్క్రిప్ట్ లో మార్పులు జరిగినట్లు వార్తలు వస్తున్నాయి.
 
దీనితో ఈమూవీలో తల్లి పాత్ర కీలకం అయిన నేపధ్యంలో త్రివిక్రమ్ ఏరికోరి టబును తీసుకున్నాడని టాక్. ఇలాంటి పరిస్థుతులలో ఈమూవీకి ‘అలక నందన’ అన్న టైటిల్ పెడితే బాగుంటుందనీ త్రివిక్రమ్ సూచన బన్నీకి కూడ నచ్చడంతో ఈ టైటిల్ వైపు అడుగులు వేస్తున్నట్లు సమాచారం. అయితే ఇలాంటి లేడీ ఓరియంటెడ్ టైటిల్ అల్లు అర్జున్ సినిమాకు పెడితే మార్కెట్ పరంగా బయ్యర్లతో సమస్యలు వస్తాయని అల్లు అరవింద్ సూచించడంతో మరొక టైటిల్ గురించి త్రివిక్రమ్ మేధోమధనం చేస్తున్నట్లు సమాచారం..   


మరింత సమాచారం తెలుసుకోండి: