స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ త్రివిక్రం సినిమా తర్వాత వేణు శ్రీరాం డైరక్షన్ లో ఓ సినిమా ఫిక్స్ చేసుకున్నాడు. దిల్ రాజు బ్యానర్ లో వస్తున్న ఈ సినిమాకు టైటిల్ గా ఐకాన్ అని పెట్టారు. ఈమధ్యనే బన్ని పుట్టినరోజు నాడు ఈ సినిమా ఎనౌన్స్ మెంట్ జరిగింది. దిల్ రాజు బ్యానర్ లో ఆర్య, పరుగు, డిజే తర్వాత అల్లు అర్జున్ చేస్తున్న నాల్గవ సినిమాగా ఈ ప్రాజెక్ట్ భారీ క్రేజ్ తెచ్చుకుంది.


ఇక ఈ సినిమా నుండి ఓ సర్ ప్రైజ్ న్యూస్ బయటకు వచ్చింది. సినిమాలో బన్ని ఒక రోల్ కాదట.. రెండు పాత్రల్లో కనిపిస్తాడట. ఒకడే ఇద్దరుగా కనిపిస్తాడా అంటే కాదు కాదు ఈ సినిమాలో అల్లు అర్జున్ డ్యుయల్ రోల్ చేస్తాడని తెలుస్తుంది. ఐకాన్ సినిమాకు ఉపశీర్షికగా కనబడుట లేదు అని పెట్టారు.


స్టైలిష్ స్టార్ గా ఇప్పటికే బాక్సాఫీస్ పై తన సత్తా చాటుతున్న బన్ని కెరియర్ లో ఫస్ట్ టైం ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. ఆల్రెడీ మిగతా హీరోలంతా ఈ ప్రయత్నాలు చేసి సక్సెస్ అయ్యారు. తారక్ అయితే జై లవ కుశలో ఏకంగా 3 రోల్స్ చేశాడు. సరైన సబ్జెక్ట్ దొరికితే డ్యుయల్ రోల్ లో తన టాలెంట్ చూపిద్దామనుకున్న బన్ని ఫైనల్ గా ఐకాన్ లో అదరగొట్టబోతున్నాడు.


లాస్ట్ ఇయర్ నా పేరు సూర్య ఫలితం తేడా కొట్టడంతో అల్లు అర్జున్ ఇప్పుడు కథల విషయంలో కాస్త జాగ్రత్త పడుతున్నాడు. తన 19వ సినిమాగా త్రివిక్రం డైరక్షన్ లో మూవీ షురూ చేశాడు. ఈ సినిమాకు అలకనంద అనే టైటిల్ పరిశీలిస్తున్నారట. సుకుమార్ తో కూడా బన్ని సినిమా ఫిక్స్ చేసుకున్నాడు. ఆ సినిమా ఉంటుందో లేదో కాని త్రివిక్రం సినిమా తర్వాత మాత్రం ఐకాన్ మాత్రం సెట్స్ మీదకు వెళ్తుందట.


మరింత సమాచారం తెలుసుకోండి: