టెలివిజన్ లో తెలుగు ప్రేక్షకులకు ఎంతో అభిమానంగా మారింది జబర్ధస్త్ కామెడీ షో.  ఈ కార్యక్రమంతో ఎంతో మంది చిన్న చిన్న నటులు తమ టాలెంట్ చూపించి వెండి తెరపై చాన్సులు కొట్టేస్తున్నారు.  ఒకదశలో చెప్పాలంటే ప్రస్తుతం టాలీవుడ్ లో జబర్ధస్ద్ కామెడీ యాక్టర్లే ఎక్కువగా వస్తున్నారు.  ఇప్పటికే వేణు, తాగుబోతు రమేష్, చమ్మక్ చంద్ర,ధన్ రాజ్ లాంటి వారు తమ కామెడీతో నవ్విస్తున్నారు.  అయితే జబర్ధస్త్ కామెడీ ద్వారా కొంత మంది ఆడవారి వేషాలు వేస్తూ ఆకర్షిస్తున్న విషయం తెలిసిందే.

ఇలాంటి వారిలో వినోద్ (వినోదిని) ఒకరు.  చమ్మక్ చంద్ర స్కిట్ లో ఎక్కువగా నటించిన వినోదిని ప్రస్తుతం జబర్ధస్త్ కామెడీ షో మెయిన్ రోల్ పాత్ర పోషిస్తుంది.  తాజాగా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ఎన్నో ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు.  తెలుగు లో ఎంతో మంది టాప్ హీరోలు ఉన్నారని..వారిలో పాత నటుల్లో ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టమని..రొమాంటిక్ హీరో శోభన్ బాబు అంటే ఇష్టమని అన్నారు.  ఇక నేటి తరం హీరో అంటే నేచురల్ స్టార్ నాని అంటే పిచ్చి అని అన్నారు. 

ఎలాంటి బ్యాగ్ గ్రౌండ్ లేకుండా స్వయంకృషితో కష్టపడి వచ్చిన నటుల్లో నాని ఒకరని ఆయన నేచురల్ నటన అంటే చాలా ఇష్టమని అన్నారు. ఇక హాస్యాన్ని ప్రేమించే ఒక నటుడిగా చెప్పాలంటే 'బ్రహ్మానందం' గారు అంటే అంతులేని అభిమానం. నిన్నటి తరం హీరోయిన్స్ లో సౌందర్య .. రమ్యకృష్ణ అంటే ఇష్టం.  అంతే కాదు ఇలియానా, దీపికా పదుకొనె అంటా చాలా ఇష్టమని తెలిపారు వినోద్ అలియాస్ వినోదిని. 


మరింత సమాచారం తెలుసుకోండి: