ఒక సినిమా ఆడియో లేదా ప్రి రిలీజ్ ఈవెంట్ జరిగినప్పుడు ఆ సినిమాకు సంబంధించిన దర్శకుడు అదేవిధంగా సంగీత దర్శకుడు లేకుండా ఈవెంట్ నిర్వహించరు. అయితే అనూహ్యంగా నిన్న జరిగిన ‘జెర్సీ’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఆచిత్ర దర్శకుడు గౌతమ్ తిన్ననూరి సంగీత దర్శకుడు అనిరుధ్ లు డుమ్మా కొట్టడం ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. 

దీనితో వీరిద్దరూ ఈ కార్యక్రమానికి ఎందుకురాలేదు అన్నకోణంలో నిన్న జరిగిన ‘జెర్సీ’ ఫంక్షన్ లో గుసగుసలు వినిపించినట్లు టాక్. అంతేకాదు ఈమూవీ హీరో నానీతో  వీరికేమైనా అభిప్రాయభేదాలు తలెత్తాయా అన్న సందేహాలు చాలామందికి వచ్చాయి. అయితే ఈ ఫంక్షన్ జరుగుతూ ఉండగానే కొనసాగుతున్న గుసగుసలు నాని చెవిన పడటంతో అలెర్ట్ అయిన నాని ఈగుసగుసలకు వెంటనే చెక్ పెట్టె పని వెంటనే మొదలు పెట్టాడు.

అనిరుధ్ వేరేపని ఉండి ఈవెంట్‌ కు రాలేకపోయిన విషయాన్ని నాని తెలియ చేయడమే కాకుండా దర్శకుడు గౌతమ్ చెన్నైలో ఉన్న విషయాన్ని వివరించాడు. అంతేకాదు ఈసినిమాకు సంబంధించి చెన్నైలో మిక్సింగ్ పనులు పూర్తి చేసి ఫైనల్ కాపీ తీసి అమెరికాకు డిస్క్‌లు డెలివర్ చేసే పనిలో దర్శకుడు గౌతమ్ బిజీగా ఉన్న నేపధ్యంలో అతడు ఈ ఫంక్షన్ కు రాలేదని వివరంగా క్లారిటీ ఇస్తూ డ్యామేజ్ వార్తలకు పెట్టాడు.

దీనితో నాని ఇచ్చిన వివరణకు చాలమంది ఆశ్చర్యపోయారు. సాధారణంగా హీరోలు సినిమా ఫంక్షన్స్ జరుగుతున్నప్పుడు ప్రతి చిన్న విషయాన్ని పట్టించుకోరు. అయితే దీనికి భిన్నంగా నాని ‘జెర్సీ’ ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ లో అన్ని విషయాలు తానై వ్యవహరించిన తీరు అతడి కమిట్మెంట్ కు నిదర్శనం అంటూ కామెంట్స్ వచ్చాయి..  



మరింత సమాచారం తెలుసుకోండి: