తెలుగు ఇండస్ట్రీలో నేచురల్ స్టార్ గా పేరు పొందిన నాని నటించిన ‘జర్సీ’చిత్రం ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిన్న హైదరాబాద్ లో జరిగింది.  ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విక్టరీ వెంకటేష్ విచ్చేశారు.  ఈ ఫంక్షన్లో సెంట్రల్ ఎట్రాక్షన్ గా కన్నడ బ్యూటీ శ్రద్ధా శ్రీనాథ్ ఉన్నారు.  ఈ చిత్రంలో నాని సరసన శ్రద్దా దాస్ నటించిన విషయం తెలిసిందే.  అయితే ప్రీ రిలీజ్ ఫంక్షన్ సందర్బంగా  శ్రద్ధా తెలుగులో స్పీచ్ సిద్ధం చేసుకొని తన మాటలతో అందరినీ ఆకట్టుకుంటుంది.

తెలుగులో మొదటి సినిమా అయినప్పటికీ శ్రద్ధా ఎంతో బాగా తెలుగు నేర్చుకొని మరీ మాట్లాడడంపై ప్రశంసలు కురిపిస్తున్నారు.  శ్రద్దా మాట్లాడుతున్న సందర్భంలో ఫ్యాన్స్ నాని అని పెద్దగా అరవడంతో..అదే ఊపులో శ్రద్దా  'జై నాని అన్నా' అని అనడంతో అందరూ షాక్ అయ్యారు.  అక్కడే కూర్చున్న నాని కూడా ఒక్కసారే షాక్ తిన్నారు. 

సాధారణంగా ప్రీ రిలీజ్ ఫంక్షన్లో దర్శక, నిర్మాత, హీరోలను హీరోయిన్లు తెగ పొగిడేస్తుంటారు.  ఇలాంటి వరుసలు పెట్టి ఎవరూ పిలిచిన దాఖలాలు లేవు.  అలాంటిది శ్రద్ధా.. నానిని అన్న అనడంతో అభిమానులతో పాటు నాని కూడా షాక్ అయ్యాడు.  ఈ చిత్రానికి  సెన్సార్ 'యు' సర్టిఫికేట్ జారీ చేసింది.  ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: