పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఆయన చేసిన సినిమాలు పాతిక. అందులో హిట్లు కూడా తక్కువే. అయినా పవన్ చిరంజీవితో సమానమైన స్టార్ ఇమేజ్ సంపాదించుకున్నారు. ఇక వందల సినిమాలు చేసిన హీరోలకు సరిసమానగా పవన్ స్టార్ డం వెలిగిపోతోంది. పవన్ని ఏమైనా అంటే ఫ్యాన్స్ సహించరన్నది నిజమే. అది ఆయన సొంత వాళ్ళు అయినా అసలు వూరుకోరు.


ఇక పవన్ కళ్యాణ్ నుంచి విడాకులు తీసుకుని ముంబైలో ఉంటున్న రేణూ దేశాయ్ ని సైతం పవన్ అభిమానులు ఇలాగే టార్చర్ చేశారు. దాని మీద ఆవిడ సోషల్ మీడియా ద్వారా తన ఆవేదనను అప్పట్లో  బాగా వెళ్ళగక్కింది. ఇక లేటెస్ట్ గా ఆలీతో సరదాగా ప్రోగ్రాంలో రేణూ దేశాయ్ తన మనసులో భావాలను చాలా నిర్మొహమాటంగా పంచుకున్నారు. పవన్ అభిమానులు తనని వదినా అంటే ఎంతో ఆనందపడతానని ఆలీ అడిగిన ఓ ప్రశ్నకు బదులిచ్చింది. అయితే అదే అభిమానులు తనని కట్టడి చేయడానికి ప్రయత్నిస్తే చూస్తూ  వూరుకోనని కచ్చితంగా చెప్పేసింది.


వదినా అంటూ పిలుస్తూనే  ఇలాగే ఉండాలి. అలా ఉండకూడదు అని రెస్ట్రిక్షన్స్ పెట్టడమేంటని ఆ టీవీషోలో రేణూ మండిపడింది. తనకంటూ ప‌ర్సనల్ లైఫ్ లేదా, ఉండకూడదా అంటూ నిలదీసింది. పవన్ తో  విడిపోయాక తన రెండవ పెళ్ళి  విషయంలో పవన్ ఫ్యాన్స్ చేసిన అల్లరిని కూడా ఆమె ఆలీతో పంచుకుంది. పవన్ ఫ్యాన్స్ ట్రోలింగుల గురించి కూడా చెప్పుకుని ఆవేదన వ్యక్తం చేసింది. మొత్తానికి  ఇన్నాళ్ళు గూడు కట్టుకున్న ఆవేదనను ఇలా రేణూ పంచుకుందని అంతా అనుకుంటున్నారు. ఇక ఇదే షోలో పవన్ విషయంలో మాత్రం బ్యాలన్సెడ్ గా మాట్లాడిన రేణూ కళ్యాణ్ గారూ అంటూ అతన్ని గౌరవించడం ఆమె సంస్కారాన్ని తెలిపేలా ఉందని అంతా అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: