టాలీవుడ్ లో బడా ప్రొడ్యూసర్ అతను.. అతని తనయుడు ఆల్రెడీ ఓ స్టార్ హీరో.. అయితే ఓ పెద్ద ఫ్యామిలీ నుండి వచ్చిన ఆ హీరో సొంత టాలెంట్ తో సెపరేట్ స్టైల్ తో అతనికంటూ ఓ స్టార్ ఇమేజ్ సంపాదించుకున్నాడు. ఇక ఆ తర్వాత అతని తమ్ముడు కూడా హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పటివరకు చేసిన 4 సినిమాల్లో ఒక్కటే హిట్టు ఓ మళయాళ సినిమాలో క్రూషియల్ రోల్ కూడా చేశాడు.   


లేటెస్ట్ గా ఇప్పుడు ఓ రీమేక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అయితే ఈ హీరో కోసం ఓ సెపరేట్ టీం పనిచేస్తుందట. అదేంటి అంటే ఆ హీరోకి సూటయ్యే కథలను ఎంపిక చేయడమే వారి పనట. నిర్మాత కొడుకుగా అవకాశాలు వస్తున్నా ఇప్పుడు సినిమాను నడిపించేది మంచి కథలే కాబట్టి ఆ స్క్రిప్ట్స్ మీదే సదరు హీరో కాన్సెంట్రేట్ చేశాడట.


ఆ స్పెషల్ టీం పని ఏంటంటే ఆ హీరో కోసం మంచి కథ దొరికితే వెంటనే ఆ స్క్రిప్ట్ తీసుకెళ్లి అతనికి వినిపించడం. అయితే వాళ్ల ఫ్యామిలీలో సినిమా ఓకే చేయించడం అతన్ ఈజీ పనేం కాదు దాదాపు ఐదాగురు ఓకే చేశాకే సినిమా ఓకే అవుతుందట. మొత్తానికి ఆ నిర్మాత వారసుడు హీరోగా నిలబడడానికి తెగ ప్రయత్నాలు చేస్తున్నాడు.


ఎలాగు తండ్రి నిర్మాతే కాబట్టి ఇవాళ కాకపోయినా ఏదో ఒకరోజు ఆ హీరో నిలబడగలుగుతాడు. స్పెషల్ టీం రెడీ చేసుకుని మరి కష్టపడుతున్నారు అంటూ ఆ హీరో కచ్చితంగా మెగా ప్లాన్ వేశాడని చెప్పొచ్చు. మరి ఆ హీరో ప్లాన్స్ ఎంతవరకు వర్క్ అవుట్ అవుతాయో చూడాలి.  



మరింత సమాచారం తెలుసుకోండి: