సవ్యసాచి చిత్రం ద్వారా అందాల భామగా గుర్తింపు తెచ్చుకున్న కుర్ర భామ నిధి అగర్వాల్.. ఇప్పుడు పూరి జగన్నాథ్ డైరెక్షన్‌లో వస్తున్న 'ఇస్మార్ట్ శంకర్' సినిమాతో తెగ బిజీగా ఉంది. అయితే ముద్దుగుమ్మను ఓ గుండు వ్యక్తి లిప్టులోనే పట్టేసుకుని నలిపేస్తున్న ఫోటోలు హల్ చల్ చేస్తున్నాయి. 

లిఫ్టులో హీరోయిన్ ను దొరకబుచ్చుకున్న ఆ గుండు కుర్రాడు.. నడుంపై చేయ్యేసి గట్టిగా పట్టేసుకుని.. బలవంతంగా బుగ్గ మీద ముద్దుపెడుతున్న ఫోటో వైరల్ అవుతోంది. ఇంతకీ ఈ గుండు కుర్రాడెవరు అనుకుంటున్నారా. ఆయనే నిధి అగర్వాల్ మేకప్ మేన్ షాన్. 

హీరోయిన్‌లను అందంగా చూపించేది మేకప్ మేనే కదా.. అందుకే ఆయనతో నిధిచాలా క్లోజ్ గా మూవ్ అయ్యింది. క్లోజ్ ఓకే కానీ మరీ ఇంత క్లోజా అని జనం ముక్కున వేలేసుకున్నాలా ఉన్న ఈ ఫోటోలను ఆమే స్వయంగా పోస్టు చేసింది కూడా. 

మరో ఫోటోలో నిధి కూడా షాన్ బుగ్గపై ఘాటుగా ముద్దు పెట్టేసింది. ఈ ఫోటోలు పోస్ట్ చేసిన నిధి.. ''జీఎస్ టీ రీయూనియన్'' అంటూ క్యాప్షన్ పెట్టింది. ఇది చూసిన షాన్.. ''బబ్బూ.. మళ్లీ మనం చేశాం.. ఒక పగలు,ఒక రాత్రి ఎప్పటికీ గుర్తుండేలా.. నిన్ను ఎప్పటికీ పిచ్చిగా ప్రేమిస్తూనే ఉంటా.. నువ్ నాకెంతో ప్రత్యేకమైన అమ్మాయివి'' అంటూ రిప్లయ్ పెట్టాడు. మేకప్ మేన్ పై నిధి ఒలకబోస్తున్న ప్రేమ చూసి చాలా మందికి కన్నుకుట్టే ఉంటుంది కదా. 



మరింత సమాచారం తెలుసుకోండి: