Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Thu, Oct 24, 2019 | Last Updated 5:34 am IST

Menu &Sections

Search

రాజపుత్ పాయల్ మళ్ళీ హాట్ గా రెచ్చిపోయింది ..!

రాజపుత్ పాయల్ మళ్ళీ హాట్ గా రెచ్చిపోయింది ..!
రాజపుత్ పాయల్ మళ్ళీ హాట్ గా రెచ్చిపోయింది ..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

రాజపుత్ పాయల్ rx 100 సినిమాతో కుర్రకారుకు ఎక్కడ లేని హీట్ ను పెంచేసింది. దీనితో ఈ అమ్మడుకి ఎక్కడలేని క్రేజ్ వచ్చింది. అయితే ప్రస్తుతం ఈమెకు టాలీవుడ్‌లో వరసపెట్టి అవకాశాలు వస్తున్నాయి. హీరోయిన్‌గానే కాకుండా ఐటమ్ గర్ల్‌గానూ పాయల్ ప్రయత్నిస్తోంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్ అగర్వాల్, మన్నారా చోప్రా హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న ‘సీత’ చిత్రంలో పాయల్ ఐటమ్ సాంగ్ చేసింది.


 మరోవైపు ‘RDX’ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. శంకర్ భాను దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రాన్ని సి.కె.ఎంటర్‌టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సమర్పణలో హ్యాపీ మూవీస్ సంస్థ నిర్మిస్తోంది. అలాగే, వెంకటేష్-నాగచైతన్య హీరోలుగా తెరకెక్కుతోన్న ‘వెంకీ మామ’ సినిమాలోనూ పాయల్ ఒక హీరోయిన్‌గా నటిస్తోంది. మొత్తం మీద టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకోవడానికి పాయల్ ప్రయత్నిస్తోంది.


 అయితే, కేవలం సినిమాల్లోనే కాకుండా సోషల్ మీడియాలోనూ ఈ పంజాబీ భామ దుమ్ములేపుతోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫొటోలు పోస్ట్ చేస్తూ కుర్రాళ్లను తనవైపు తిప్పుకుంటోంది. పాయల్ ఒక్క ఫొటో పెడితే చాలు వేలల్లో లైకులు వచ్చి పడుతున్నాయి. ముఖ్యంగా గార్మెంట్ బ్రాండ్ల ప్రచారం నిమిత్తం పాయల్ ఈ ఫొటోలను పోస్ట్ చేస్తోంది. ‘షీన్’ అనే వెస్టరన్ బ్రాండ్‌కు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ప్రచారం కల్పిస్తోంది. ఆ దుస్తుల విషయం పక్కన పెడితే.. పాయల్ అందచందాలను చూసి ఆమె అభిమానులు ఫిదా అయిపోతున్నారు.

rajputh-payal-hot-pics
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author