ఈ  మద్య అన్ని చిత్ర పరిశ్రమల్లో వరుసగా బయోపిక్ చిత్రాలు వస్తున్న విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్రమెదీ జీవిత కథ ఆధారంగా ‘పీఎం నరేంద్రమోదీ’చిత్రాన్ని తెరకెక్కించారు.   ఈ చిత్రానికి సంబంధించిన టీజర్, ట్రైలర్ సోషల్ మీడియాలో దుమ్మురేపింది.  అయితే విడుదలకు మాత్రం వరుసగా అంతరాయాలు వస్తూ ఉన్నాయి.  బాలీవుడ్ ప్రముఖ నటుడు వివేక్ ఒబెరాయ్ ప్రధాన పాత్రలో నటించగా, ఒమంగ్ కుమార్ దర్శకత్వం వహించారు. నిజానికి ఈ సినిమా గతవారమే విడుదల కావాల్సి ఉండగా ఎన్నికల సంఘం అభ్యంతరాలతో వాయిదా పడింది.

ఈ చిత్రం విడుదలను ఈసీ అడ్డుకోవడంపై చిత్ర బృందం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. విచారించిన న్యాయస్థానం ఈ సినిమాను చూసి ఈనెల 24వ తేదీలోపు తమ అభిప్రాయాన్ని తెలియజేయాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. ప్రస్తుతం దేశంలో ఎన్నికల జరుగుతున్న సమయంలో ఈ చిత్రం రిలీజ్ అయితే ఎన్నికలపై ప్రభావం పడుతుందని ఫిర్యాదు దారుల ఆరోపణ. ఇటీవల తెలుగు లో రిలీజ్ అయిన లక్ష్మీస్ ఎన్టీఆర్ విషయంలో కూడా ఇలాంటి అభ్యంతరాలు వచ్చాయి..ఏపిలో కాకుండా అన్ని రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేశారు. 

మొన్నటి వరకు  ‘పీఎం నరేంద్రమోదీ’ ట్రైలర్ యూట్యూబ్ లో కనిపించింది.  తాజాగా ఇప్పుడు  ‘పీఎం నరేంద్రమోదీ’ యూట్యూబ్ లో కనిపించకుండా పోయింది.  ఈ వీడియో అందుబాటులో లేదని యూట్యూబ్ చెబుతోంది. దీంతో యూట్యూబ్ నుంచి కావాలనే ఈ చిత్రం ట్రైలర్‌ను తొలగించినట్టు తెలుస్తోంది. అయితే, ఎవరు తొలగించారన్నది మాత్రం తెలియడం లేదు.  


మరింత సమాచారం తెలుసుకోండి: