'ఆర్ ఆర్ ఆర్' కథకు జూనియర్ చరణ్ లు హీరోలుగా ఎంపిక అయిన తరువాత ఆసినిమా పూర్తి అయ్యే వరకు వేరే సినిమా ఎట్టి పరిస్థితులలోను ఒప్పుకోకూడదు అన్న లోలోపలి కండీషన్ ఉంది. ఈమూవీ 2020 జూలైలో విడుదల అవుతుంది అని చెపుతున్నా ప్రస్తుతం ఈమూవీ షూటింగ్ జరుగుతున్న తీరును పరిశీలించిన వారు ఈమూవీ రిలీజ్ యాక్షన్ ప్లాన్ లో మార్పులు వచ్చి 2020 సంవత్సరం చివరకు ఈమూవీ విడుదలైనా ఆశ్చర్యం లేదు అని అంటున్నారు. 

ఇలాంటి పరిస్థుతులలో జూనియర్ అదేవిధంగా చరణ్ లు మరో సినిమా గురించి కథ వినడం కూడ అనవసరం. అయితే ఈమధ్య దర్శకుడు వంశీ పిడి పల్లి చరణ్ ను కలిసి ఒక కథను చెప్పినట్లు సమాచారం. ఈ కథ చరణ్ కు నచ్చడంతో ఆ కథను తనగురించి రిజర్వ్ చేయమని మూవీ ప్రాజెక్ట్ విషయమై తాను వచ్చే సంవత్సరం మొదట్లో ఆలోచిస్తాను అని చెప్పినట్లు టాక్. 

అయితే ఈ విషయం తెలుసుకున్న జూనియర్ తో సన్నిహితంగా ఉండే టాప్ డైరెక్టర్లు కొరటాల శివ అట్లీ సురేంద్ర రెడ్డి లాంటి కొందరు జూనియర్ ను కాంటాక్ట్ చేసి తమ వద్ద ఒక మంచి కథ ఉందనీ చెప్పినా కనీసం కథ వినడానికి కూడా జూనియర్ ఆసక్తి కనపరచ లేదని వార్తలు వస్తున్నాయి. అంతేకాదు ప్రస్తుతం తన దృష్టి అంతా  రాజమౌళి 'ఆర్ ఆర్ ఆర్ ' పై ఉందనీ ఆమూవీ పూర్తి అయ్యేంతవరకు కనీసం మరో సినిమా కథవినే విషయం కూడ ఆలోచించను అంటూ మృదువుగా తనతో కాంటాక్ట్ లోకి వచ్చిన టాప్ దర్శకులకు సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది. 

ఇప్పుడు ఈ గాసిప్ ఇండస్ట్రీ వర్గాలలో వైరల్ కావడంతో రాజమౌళి పట్ల జూనియర్ కు ఉన్న కమిట్మెంట్ ను జూనియర్ సమాధానం సూచిస్తోంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి. దర్శకుడుగా రాజమౌళి హీరోగా జూనియర్ ల కెరియర్ ఒకేసారి ప్రారంభం అయిన నేపథ్యంలో జూనియర్ కు ఆ మాత్రం విస్వాసం నమ్మకం రాజమౌళి పై ఉంటుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు..   


మరింత సమాచారం తెలుసుకోండి: