అప్పట్లో యువ సంగీత దర్శకుడు అనిరుథ్ సంగీతం అందించగా కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ పాడిన పాట్ ‘కొలివరి కొలివరి’ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో రికార్డులు సృష్టింది.  ఈ తరహాలో ఓ దక్షిణాది సాంగ్ ప్రపంచ వ్యాప్తంగా సంగీత అభిమానులను ఉర్రూతలూగించి ఎన్నో కొత్త రికార్డులకు నాంది పలికింది.  ఇక ఆ స్థాయిలో ఏ సాంగ్ పాపులర్ కాలేదు. 

తాజాగా ప్ర‌ముఖ మ‌ల‌యాళీ న‌టుడు మోహ‌న్ లాల్ న‌టించిన‌ 'వెలిప‌డింతె పుస్త‌కం' అనే సినిమాలోని జిమిక్కి క‌మ్మ‌ల్ అనే సాంగ్  ఇప్పుడు రికార్డుల మోత మోగిస్తుంది.  కేవ‌లం మ‌ల‌యాళీ ఆడియ‌న్సే కాకుండా దేశ వ్యాప్తంగా ఉన్న మ్యూజిక్ ల‌వ‌ర్స్ అంద‌రు ఈ సాంగ్‌ని బాగా ఎంజాయ్ చేశారు. ఎన్నో ప్రైవేట్ కార్యక్రమాల్లో ఈ పాటలను ప్లే చేస్తూ ఆడియన్స్ ఎంజాయ్ చేస్తున్నారు.  అంతే కాదు విదేశాల్లో సైతం ఈ సాంగ్ కి మంచి ఆదరణ పెరిగింది.  అమెరికా టీవీ హోస్ట్ జిమ్మి కిమ్మెల్ కూడా స్పందించి... త‌న‌కు ఈ పాట తెగ న‌చ్చింద‌ని అప్ప‌ట్లో ట్వీట్ చేశాడు.

అయితే జిమ్మిక్కి క‌మ్మ‌ల్ సాంగ్ తాజా అరుదైన ఘ‌న‌త సాధించింది. సంగీత ద‌ర్శ‌కుడు షాన్ రెహ‌మాన్ త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ ఘ‌న‌త‌కి సంబంధించిన విష‌యాన్ని తెలియ‌జేశారు. ఈ పాటని శ్రీనివాస‌న్, రంజిత్ ఉన్ని ఆల‌పించ‌గా, అనీల్ ప‌న‌చూర‌న్ లిరిక్స్ అందించారు.  ఓ మ‌ల‌యాళ వీడియో ఈ మార్క్ చేరుకోవ‌డం ఇదే తొలిసారి. 



మరింత సమాచారం తెలుసుకోండి: