ఒకే ఒక్క చిత్రం ఈ మద్య కొంత మంది కొత్త నటుల జాతకాలు మారుస్తున్నాయి.  ఇటీవల సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ శిశ్యుడైన అజయ్ భూపతి దర్శకత్వంలో ‘ఆర్ ఎక్స్ 100’చిత్రం పెను సంచలనాలు రేపింది.  మొదటి చిత్రమే అయినా సీనియర్ దర్శకుడిలా ఈ చిత్రాన్ని తెరకెక్కించారని ప్రశంసలు అందుకున్నాడు అజయ్ భూపతి.  ఈ చిత్రంతో హీరోగా పరిచయం అయ్యాడు కార్తికేయ.  మొదటి చిత్రం అయినా..ఎలాంటి ఇబ్బందులు లేకుండా చాలా ఈజీగా నటించాడు. 

కాకపోతే ఈ చిత్రంలో ఎక్కువగా బోల్డ్ కంటెంట్ ఉండటంతో కొన్ని వర్గాలు మాత్రమే ఈ చిత్రాన్ని ఆదరించినా..తర్వాత అందరికీ బాగా కనెక్ట్ అయ్యింది.  దాంతో కలెక్షన్లు కూడా బారీగానే వసూళ్లు చేసింది.  ఈ చిత్రంలో లవ్ అండ్ యాక్షన్ ను తనదైన శైలిలో పండించిన తీరు కళ్లముందు కదలాడుతుంది.   తాగాజా ఆర్ ఎక్స్ 100 హీరో కార్తికేయ హీరోగా హిప్పీ  నిర్మితమైంది. కలైపులి థాను నిర్మించిన ఈ సినిమాకి విడుదల తేదీని ఖరారు చేశారు. జూన్ 7వ తేదీన ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేయనున్నారు.

టీఎన్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, కార్తికేయ జోడీగా దిగాంగన నటించింది. ఈ సినిమాతోనే ఈ అమ్మాయి తెలుగు తెరకి పరిచయమవుతోంది.  ఈ చిత్రంలో చక్రవర్తి , వెన్నెల కిషోర్ ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు.  ఈ చిత్రంలో కొత్త యాంగిల్ లో కార్తికేయ కనిపించబున్నాడట.. మరి ఈ హీరోకి మరో విజయాన్ని చేరుస్తుందేమో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: