మొన్నటి వరకు మా ఎన్నికల్లో జరిగిన రాద్దంతం అంతా ఇంతా కాదు.  గత నాలుగైదు సంవత్సరాలుగా మా ఎన్నికల సమయంలో ఎదో ఒక  కాంట్రవర్సీ చెలరేగుతూ వస్తుంది.  ఈ సంవత్సరం కూడా శివాజీరాజా, సీనియర్ నరేష్ ల మద్య మాటల యుద్దం నడిచింది.  మొత్తానికి మా అధ్యక్షులుగా నరేష్ ఎన్నికైన విషయం తెలిసిందే.  ఈ ఎన్నికల్లో రాజశేఖర్, జీవిత దంపుతులు కూడా నరేష్ ప్యానల్ తరుపు నుంచి గెలిచిన విషయం తెలిసిందే.  ఈ సంవత్సరం ‘ మా’ సంస్థను ఎంతో గౌరవంగా..ప్రశాంతంగా ముందుకు తీసుకు వెళ్తామని చెప్పిన అధ్యక్షులు నరేష్ అప్పుడే అపవాదులు ఎదుర్కొంటున్నారు. 


ఈ మద్య మా సంస్థ నుంచి డబ్బులు ప్రముఖ హీరో రాశేఖర్ కూతురు అకౌంట్ లోకి వెళ్లడం పై విమర్శలు తలెత్తిన విషయం తెలిసిందే. దాంతో మా లో అలజడి మొదలైందని వార్తలు రావడం సంచలనం రేపింది.   సభ్యుల సంక్షేమం కోసం వాడవలసిన డబ్బు .. ఎందుకు జీవిత కూతురు ఖాతాలోకి వెళ్లింది అనే ఆరాలు .. విమర్శలు మొదలయ్యాయి.


తాజాగా జీవిత రంగంలోకి దిగారు.. దీనిపై ఆమె స్పందిస్తూ, ''మా'లో అర్హులైన సభ్యులకు ప్రభుత్వ పథకాలు అందాలనే విషయం గురించి మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ గారితో మాట్లాడాము. ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి తదితర పథకాలు పేదవారు, అర్హులైన సభ్యులు ఉంటే మా సంఘంలో వారికి కూడా అందేలా చేస్తామని హామీ ఇచ్చిందని, కారణంగానే తమ వంతుగా ఆ మంచి పథకాలను ప్రచారం చేయాలని నిర్ణయించామని చెప్పారు. చాలా తక్కువ ఖర్చుతో ఏడున్నర లక్షలతో ప్రకటనలు రూపొందించామని చెప్పారు. 


అధ్యక్షుడు నరేశ్ షూటింగులో ఉండటంతో, ఆ ప్రకటనలకి అయిన ఖర్చును నేను సర్దుబాటు చేశాను. ఆ తరువాత ఆ మొత్తాన్ని తీసుకున్నాను. కావాలని కొంతమంది ఈ విషయాన్ని తప్పుగా ప్రచారం చేశారు. మేము ఎలాంటి అవినీతికి పాల్పడలేదు .. 'మా' నిధులు దుర్వినియోగమూ కాలేదు" అంటూ ఆమె స్పష్టం చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: