టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీ మోస్ట్ హ్యాండ్ సమ్  కపుల్ గా మహేష్ నమ్రతలకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. నాలుగు సంవత్సరాల పాటు ప్రేమించుకుని పెళ్ళి చేసుకున్న వీరిద్దరూ ఇద్దరు పిల్లల తల్లి తండ్రులు అయినా మహేష్ పై నమ్రత ప్రేమ ఏమాత్రం తరిగిపోలేదు. 

మహేష్ పై తనకున్న ప్రేమను వ్యక్త పరుస్తూ నమ్రత ఈమధ్య సోషల్ మీడియాలో పెట్టిన కామెంట్ ఆమెకు మహేష్ పై ఉన్న విపరీతమైన ప్రేమను మరొకసారి రుజువు చేస్తోంది. ‘డియర్ డ్రగ్స్ నో థాంక్స్ ఐయామ్ ఆల్రెడీ ఎడిక్ట్ డ్ టు మహేష్ బాబు’ అంటూ నమ్రత చేసిన కామెంట్స్ మహేష్ అభిమానుల మధ్య వైరల్ గా మారాయి. 

ఈ కామెంట్స్ చూసిన మరికొందరు నమ్రత కామెంట్స్ పై వేరే విధంగా జోక్ చేస్తున్నారు. మహేష్ పై నమ్రతకు ఉన్న ప్రేమ అందరికీ తెలిసిన విషయమే అయినా ఏకంగా మహేష్ మ్యానియాను డ్రగ్స్ తో పోలుస్తూ ఆమె కామెంట్స్ చేయడం మితిమీరినట్లు ఉంది అంటూ జోక్స్ వేస్తున్నారు. 

ఇలా కొందరు కామెంట్స్ చేస్తున్నా నమ్రత వ్యాఖ్యలు మటుకు మహేష్ అభిమానులకు బాగా కనెక్ట్ అయ్యాయి. మహేష్ 45 సంవత్సరాలు దాటిపోతున్నా ఇంకా అమ్మాయిల దృష్టిలో క్రేజీ హీరోగా కొనసాగుతున్న నేపధ్యంలో నమ్రత మహేష్ మ్యానియాను ఇలా డ్రగ్స్ మ్యానియాతో పోల్చి కామెంట్స్ చేసింది అనుకోవాలి..       


మరింత సమాచారం తెలుసుకోండి: