రేపువిడుదల కానున్న ‘జెర్సీ’ మీద నాని చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. గత సంవత్సరం వచ్చిన రెండు ఫెయిల్యూర్ అనుభవాలు దృష్ట్యా హిట్ రావడం నానికి చాలా అవసరం. నానీకి ఉన్న క్రేజ్ రీత్యా ‘జెర్సీ’ కి ప్రపంచ వ్యాప్తంగా 26 కోట్ల బిజినెస్ జరిగింది. ‘జెర్సీ’ కి పాజిటివ్ టాక్ వస్తే పర్వాలేదు కానీ టాక్ లో ఏమాత్రం తేడా వచ్చినా ఈమూవీ బయ్యర్లు తీవ్రంగా నష్టపోయే ఆస్కారం ఉంది. 

ఇలాంటి పరిస్థుతులలో నానీని దెయ్యం భయపడుతోంది అంటూ సెటైర్లు పడుతున్నాయి. దీనికి కారణం ‘జెర్సీ’ మ్యానియాను పట్టించుకోకుండా లారెన్స్ తన ‘కాంచన 3’ చేస్తున్న సాహసం సాధారణంగా దెయ్యం సినిమాలకు మాస్ సెంటర్లలో కలక్షన్స్ చాల బాగా ఉంటాయి. అంతేకాదు లారెన్స్ సైలెంట్ కిల్లర్ అన్న బిరుదు ఉంది. 

లారెన్స్ తీసిన కాన్సెప్ట్ నే మళ్ళీమళ్ళీ తీసినా మాస్ పల్స్ కి తగ్గట్టు వాళ్ళకు ఏమేం కావాలో అవన్నీ ఉంచి సాధారణ ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా సినిమాలు తీయడంలో లారెన్స్ సిద్దహస్తుడు. దీనికితోడు ‘జెర్సీ’ సినిమాలో ఎక్కువగా సెంటిమెంట్ ఎమోషన్ సీన్స్ కు ఎక్కువ ప్రాధాన్యత ఉంది అన్న వార్తలు వస్తున్న నేపధ్యంలో ఇలాంటి సినిమాలు మల్టీ ప్లేక్స్ ప్రేక్షకులు చూస్తారు కాని బిసి సెంటర్లలోని మాస్ ప్రేక్షకులు చూడరు. 

‘జెర్సీ’ నాని కోరుకున్న స్థాయిలో విజయం సాధించాలి అంటే కనీసం 40 కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చి తీరాలి. ఇలాంటి పరిస్థుతులలో ఒక సెంటిమెంట్ సినిమాకు మాస్ ప్రేక్షకులు ఎంత వరకు కనెక్ట్ అవుతారు అన్న విషయమై ‘జెర్సీ’ సక్సస్ ఆధారపడి ఉంటుంది అన్న కామెంట్స్ వస్తున్నాయి..  



మరింత సమాచారం తెలుసుకోండి: