బాలక్రిష్ణకు జూనియర్ ఎన్టీఆర్ షాకిచ్చాడు, అంతే కాదు ఇక తనకు తాను తన పేరుపైనే ఎదుగుతాను అన్న సంకేతాలు కూడా జారిచేసాడు అంటూ టాలీవుడ్ తో రాజకీయుల్లో కూడా టాక్ మొదలయింది. రామయ్యా వస్తావయ్యా సినిమా ఆడియో ఫంక్షన్ తో ఈ సంకేతాలను జూనియర్ క్లియర్ గా జారీ చేసాడంటున్నారు.

నందమూరి హీరోలు వారి ఏసినిమా ఫంక్షన్లలో నైన తప్పనిసరిగా వారి నోట వచ్చే కొన్ని డైలాగులు ఈ సారి జూనియర్ నోట రాలేదు. అదే నందమూరి వంశం గొప్పల ప్రస్తావన. సీనియర్ ఎన్టీఆర్, బాలక్రిష్ణ  ల ప్రస్తావన, నందమూరి వంశ గొప్పదనపు డైలాగులు జూనియర్ నోట వస్తాయని అందరు ఊహించారు.

కాని జూనియర్ అలాంటి ఒక్క మాట కూడా మాట్లాడలేదు, నందమూరి అన్న పదాన్నే తన నోట రానీయలేదు. అంటే ఇక తాను నందమూరి హీరోలతో విబేదిస్తున్నానన్న సూచనలు ఆయన ఇచ్చినట్టే. అయితే గియితే కనుక తనకు తానే నందమూరి వారసుడిగా ఎదిగి చూపిస్తాను తప్ప ఇక ఎవరితో పోల్చుకోవాల్సిన అవసరం లేదన్న భావన జూనియర్ కలిగిందన్నది మాత్రం ఈ ఫంక్షన్ తెలియ చేసింది అంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: