కన్నడ బ్యూటీ రష్మిక మందన్న కిరాక్ పార్టీ హీరో రక్షిత్ శెట్టితో ఎంగేజ్మెంట్ కూడా జరుపుకుంది. ఇద్దరు ప్రేమలో పడి వారి ఫ్యామిలీస్ ను ఒప్పించి పెళ్లికి సిద్ధమయ్యారు. అయితే ఆ టైంలోనే రష్మిక తెలుగులో ఛలో హిట్ అందుకుని గీతా గోవిందం సినిమా చేసింది. ఆ సినిమాలో విజయ్ దేవరకొండతో ముద్దు సీన్ వారి పెళ్లికి చిచ్చు పెట్టింది.


విజయ్ దేవరకొండతో లిప్ లాక్ సీన్ పై రక్షిత్ ఫ్యామిలీ మెంబర్స్ అభ్యంతరాలు చెప్పారట. ఎంగేజ్మెంట్ అయ్యాక ఇలా ఎవరైనా వేరే హీరోతో లిప్ లాక్స్ చేస్తారా అని రక్ష్మిక మీద ఫైర్ అయ్యారట. సినిమా పరిశ్రమలో ఇవన్ని సహజమని రక్షిత్ అర్ధం చేసుకున్నా అతని ఫ్యామిలీ మాత్రం పెద్ద గొడవ చేశారట.


అందుకే రష్మిక ఫ్యామిలీ అతనితో పెళ్లి క్యాన్సిల్ చేశారట. పర్సనల్ లైఫ్ కన్నా కెరియర్ ముఖ్యమని భావించి రష్మిక రక్షిత్ లు విడిపోయారు. అయితే కన్నడ రక్షిత్ ఫ్యాన్స్ మాత్రం ఛాన్స్ దొరికితే రష్మికను ట్రోల్ చేస్తూ వస్తున్నారు. ప్రస్తుతం రష్మిక విజయ్ దేవరకొండతోనే డియర్ కామ్రేడ్ సినిమా చేస్తుంది.


ఆ సినిమా టీజర్ లో కూడా రష్మికను విజయ్ లిప్ లాక్ చేశాడు. ఈ ఇద్దరి క్రేజీ కాంబినేషన్ మరోసారి హైలెట్ గా నిలిచేలా ఉంది. రక్షిత్, రష్మికలు విడిపోడానికి విజయ్ దేవరకొండ కారణమని అప్పట్లో వార్తలు వచ్చాయి. కాని ఇరు కుటుంబాల గొడవల వల్ల వారి పెళ్లికి బ్రేక్ పడ్డది. ఆ తర్వాత ఎవరిదారి వారు చూసుకున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: