సాయి తేజ్ హీరోగా కిశోర్ తిరుమల డైరక్షన్ లో వచ్చిన సినిమా చిత్రలహరి. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా తేజ్ కు సూపర్ హిట్ ఇచ్చింది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాలోని అన్ని సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయి. ముఖ్యంగా ప్రేమ వెన్నెల, గ్లాస్ మెట్స్ సాంగ్ అదిరిపోయాయి.


గ్లాస్ మెట్స్ సాంగ్ యశ్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. తాగిన మైకంలో సాయి తేజ, సునీల్ ఇద్దరు కలిసి స్టెప్పులేస్తూ పాడే గ్లాస్ మెట్స్ సాంగ్ కు థియేటర్ లో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఢీ షో ద్వారా తన టాలెంట్ ప్రూవ్ చేసుకున్న యశ్ ఇప్పుడు సినిమాలు చేస్తున్నాడు. అతని టాలెంట్ కు తగినట్టుగానే అవకాశాలు వస్తున్నాయి.


ఈ సాంగ్ షూట్ లో బార్లో సాయి తేజ, సునీల్, హైపర్ ఆది చేసిన రచ్చ అంతా ఇంతా కాదు ఆ పాట మేకింగ్ వీడియో చూస్తే మీకే అర్ధమవుతుంది. ఇక ఈ సాంగ్ చేస్తున్నప్పుడు తమ ఫీలింగ్స్.. ఆ టైంలో ఏం జరిగింది అన్నది మేకింగ్ వీడియోతో పాటుగా సాయి తేజ్, సునీల్, ఆది బైట్ ఇవ్వడం జరిగింది.


మొత్తనికి సాయి తేజ్ ఖాతాలో ఓ హిట్టు సినిమా పడ్డది. 13 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ తో రిలీజైన చిత్రలహరి ఇప్పటికే 8 కోట్ల పైగా వసూళ్లు రాబట్టింది. కళ్యాణి ప్రియదర్శన్, నివేదా పేతురాజ్ హీరోయిన్స్ గా నటించిన చిత్రలహరి సినిమా యూత్ ఆడియెన్స్ కు బాగా నచ్చేసింది. మెగా మేనళ్లుడు సినిమా చూసిన చిరు, పవన్ తమ స్పెషల్ గ్రీటింగ్స్ కూడా అందించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: