నాచురల్ స్టార్ నాని హీరోగా గౌతం తిన్ననూరి డైరక్షన్ లో వస్తున్న సినిమ జెర్సీ. రేపు అనగా ఏప్రిల్ 19 శుక్రవారం రిలీజ్ అవుతున్న ఈ సినిమాపై ఆడియెన్స్ లో పాజిటివ్ వైబ్ ఏర్పడింది. నాని క్రికెటర్ గా కనిపిస్తున్న ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ లో సూర్యదేవర నాగ వంశీ నిర్మించారు. అనిరుధ్ రవిచంద్రన్ ఈ సినిమాకు మ్యూజిక్ అందించారు.


లాస్ట్ ఇయర్ కృష్ణార్జున యుద్ధం, దేవదాస్ సినిమాలతో నిరాశపరచిన నాని జెర్సీతో కచ్చితంగా హిట్టు కొడతా అంటున్నాడు. సినిమా ట్రైలర్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. నాచురల్ స్టార్ నాని మరోసారి తన నాచురల్ నటనతో ఆడియెన్స్ ను ఫిదా అయ్యేలా చేస్తాడని అంటున్నారు. నాని జెర్సీ సినిమాలో శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్ గా నటించింది.


ఇక సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా బాగానే చేసింది. వరల్డ్ వైడ్ గా జెర్సీ 26 కోట్ల బిజినెస్ చేసిందని తెలుస్తుంది. ఏరియాల వారిగా నాని జెర్సీ ప్రీ రిలీజ్ బిజినెస్ డీటైల్స్ చూస్తే..


నైజాం : 10 .00 కోట్లు 
సీడెడ్ : 3.20 కోట్లు
ఈస్ట్ : 1.60 కోట్లు
కృష్ణ : 1.45 కోట్లు
గుంటూరు : 1.80 కోట్లు
వెస్ట్ : 1.25 కోట్లు
నెల్లూరు : 0.80 కోట్లు


ఏపీ/తెలంగాణ : 20.10 కోట్లు


రెస్ట్ ఆఫ్ ఇండియా : 1.90 కోట్లు


ఓవర్సీస్ : 4.00 కోట్లు


వరల్డ్ వైడ్ : 26.00 కోట్లు


మరింత సమాచారం తెలుసుకోండి: