ప్రస్తుతం టాప్ యంగ్ హీరోలు రకుల్ ప్రీత్ తో నటించడానికి ఇష్టపడని నేపధ్యంలో ఆమె బాలీవుడ్ వైపు యూటర్న్ తీసుకుని అజయ్ దేవగన్ తో ‘దే దే ప్యార్ దే’ సినిమాలో నటిస్తోంది. ఈమూవీలోని రకుల్ హాట్ లుక్స్ కు బాలీవుడ్ మీడియా కూడ షేక్ అవుతోంది. ఇలాంటి పరిస్థుతులలో ఆమెకు అనుకోకుండా నాగార్జున ‘మన్మధుడు 2’ లో అవకాసం రావడంతో ఆమె మంచి జోష్ లో ఉంది. 

ఈసినిమాకు సంబంధించిన షూటింగ్ అంతా పోర్చుగల్ దేశంలో జరుగుతోంది. ఇప్పటికే ఈసినిమాకు సంబంధించి కొన్ని సీన్స్ రకుల్ నాగార్జునల పై చిత్రీకరించారు. అయితే ఇప్పటికే షూటింగ్ జరుపుకున్న ఈమూవీ సీన్స్ రషస్ చూసిన నాగార్జునకు రకుల్ విషయంలో అసంతృప్తి కలిగినట్లు సమాచారం. 

దీనికి కారణం నాగార్జున పక్కన రకుల్ చాల చిన్నపిల్లలా కనిపించడమే కాకుండా చాల గ్లామరస్ గా కనిపించిందట. అయితే ఈమూవీలోని రకుల్ పాత్ర రీత్యా అంత గ్లామరస్ గా కనిపించకూడదనీ అదేవిధంగా కొద్దిగా లావుగా కూడా కనిపిస్తే బాగుంటుందనీ నాగార్జున అభిప్రాయ పడినట్లు తెలుస్తోంది. దీనితో రకుల్ లావు అయ్యాక తనతో చిత్రీకరించ వలసిన రొమాంటిక్ సీన్స్ తీయమనీ నాగ్ ఈమూవీ డైరెక్టర్ రాహుల్ కు సూచించినట్లు టాక్. 

నాగార్జున అభిప్రాయం తెలుసుకున్న రాహుల్ ‘కాక్టెయిల్’ మూవీలో దీపికా పదుకొనె బొద్దుగా కనిపించినట్లుగా కనిపించమని సలహా ఇవ్వడమే కాకుండా దానికి తగ్గట్టుగా డైటింగ్ మొదలుపెట్టమని సూచించినట్లు వార్తలు వస్తున్నాయి. దీనితో రకుల్ ఇజ్రాయిల్ నుండి హైదరాబాద్ తిరిగి వచ్చి తాను వెంటనే లావు అవ్వడానికి అవసరమైన పద్ధతుల గురించి డైటీషియన్స్ తో చర్చిస్తున్నట్లు టాక్..    



మరింత సమాచారం తెలుసుకోండి: