బాహుబలి తర్వాత రాజమౌళి డైరెక్ట్ చేస్తున్న ఆర్.ఆర్.ఆర్ సినిమా ప్రస్తుతం పూణె షెడ్యూల్ కు రెడీ అవుతుంది. అసలైతే ఆ షెడ్యూల్ ఈమధ్యనే మొదలుపెట్టినా రాం చరణ్ కు గాయమవడం వల్ల షూటింగ్ వాయిదా వేశారు. అంతలోనే ఏపి ఎలక్షన్స్ కూడా రావడంతో రాజమౌళి యూనిట్ సభ్యులకు సెలవులు ఇచ్చాడు.


ఇక ఈ నెల చివరన మళ్లీ షెడ్యూల్ మొదలు పెడతారని తెలుస్తుంది. అయితే ఈ షెడ్యూల్ లో ఎన్.టి.ఆర్ ఇంట్రో సీన్ ప్లాన్ చేస్తున్నారట. రాం చరణ్ ఇంట్రో సీన్ ఇప్పటికే షూట్ చేయగా త్వరలో తారక్ ఇంటో సీన్ షూట్ చేస్తారట. ఈ ఇంట్రో సీన్ కోసమే 50 కోట్లు ఖర్చు చేస్తున్నారట. కేవలం ఇంట్రోలకే అంత ఖర్చా అని ఆశ్చర్యపోవచ్చు.


కొమరం భీం గా ఎన్.టి.ఆర్, అల్లూరి సీతారామరాజుగా రాం చరణ్ ఇలా ఇద్దరు ఇంట్రోలు అదిరిపోతాయట. అంతేకాదు సినిమాలో స్పెషల్ రోల్ చేస్తున్న అజయ్ దేవగన్ ఇంట్రో కూడ అదిరిపోతుందని అంటున్నారు. ఈ ముగ్గురు ఇంట్రోలకు 50 కోట్ల బడ్జెట్ కేటాయించారట. 400 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఆర్.ఆర్.ఆర్ సినిమా బాహుబలి మించే సినిమాగా జక్కన్న తెరకెక్కిస్తున్నారు.


సినిమాలో హీరోయిన్ గా అలియా భట్ ఓకే అవగా డైసీ ఎడ్గర్ జోన్స్ ప్లేస్ లో నిత్యా మీనన్ ను మాట్లాడుతున్నట్టు తెలుస్తుంది. తారక్, చరణ్ ఇద్దరు వారి వారి పాత్రలకు ది బెస్ట్ అవుట్ పుట్ ఇస్తున్నారట. బాహుబలి తర్వాత తెలుగు సినిమా స్థాయిని మరోసారి ఆర్.ఆర్.ఆర్ పెంచుతుందని చెబుతున్నారు. 2020 జూలై 30న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: