రామ్ చరణ్ కు అయిన గాయం వల్ల ‘ఆర్ ఆర్ ఆర్’ షూటింగ్ కు బ్రేక్ పడినా ఈమూవీకి సంబంధించిన లీకులు మాత్రం వ్యూహాత్మకంగా బయటకు వస్తూనే ఉన్నాయి. చరణ్ తన గాయం నుండి ఇంచుమించు కోలుకున్న నేపధ్యంలో ఈ మూవీ షూటింగ్ త్వరలోనే మళ్ళీ మొదలు పెట్టే ఆలోచనలు రాజమౌళి చేస్తున్నట్లు సమాచారం.     

డాక్టర్ల నుండి చరణ్ విషయమై క్లియరెన్స్ వచ్చిన వెంటనే షూటింగ్ కోసం బయలుదేరడానికి రాజమౌళి తన టీమ్ ను పూర్తిగా సిద్ధం  చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇలాంటి పరిస్థుతులలో లేటెస్ట్ గా అందుతున్న సమాచారం మేరకు ఈ మూవీకి సంబంధించిన లేటెస్ట్ షెడ్యూల్ లో జూనియర్ పాత్ర ఇంట్రడక్షన్ సీన్ చాలా భారీ స్థాయిలో తీయబోతున్నట్లు సమాచారం. 

ఈ సీన్ కేవలం 5నిమషాలు మాత్రమే ఉన్నా ఈ సీన్ చిత్రీకరణ కోసం 20 కోట్లు ఖర్చు పెట్ట బోతున్నట్లు సమాచారం. ఇప్పటికే పూర్తి అయిన ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ లో రామ్ చరణ్ ఇంట్రడక్షన్ సీన్ ను ఇప్పటికే రాజమౌళి భారీగా చిత్రీకరించాడు. ఇప్పుడు తారక్ వంతు వచ్చింది అని అంటున్నారు.  

ఈ సీన్ చిత్రీకరణ పూర్తి అయ్యాక అజయ్ దేవగన్ స్పెషల్ ఇంట్రడక్షన్ సీన్ కూడ ఓ రేంజ్ లో చిత్రీకరించబోతున్నట్లు సమాచారం. ఈ మూడు ఇంట్రడక్షన్ సీన్స్ కు కలిపి 60 కోట్ల దాకా ఖర్చు పెడుతున్నట్లు తెలుస్తోంది. కేవలం ఐదు నిమిషాల లోపే ఉండే హీరోల ఇంట్రడక్షన్ సీన్స్ కోసం రాజమౌళి ఈ స్థాయిలో ఇలా ఖర్చుపెడుతున్న పరిస్తుతులను పరిశీలిస్తున్నవారు ‘ఆర్ ఆర్ ఆర్’ బడ్జెట్ 400 కోట్లు దాటిపోయినా ఆశ్చర్యం లేదు అని అంటున్నారు.. 



మరింత సమాచారం తెలుసుకోండి: