నాని కెరియర్ లో ఏ సినిమాకు తీసుకోనంత జాగ్రత్తలు ‘జెర్సీ’ విషయంలో తీసుకోవడమే కాకుండా ఈమూవీ ప్రమోషన్ విషయంలో నాని చూపెడుతున్న మితిమీరిన శ్రద్ధ ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. ప్రింట్ మీడియా ఎలట్రానిక్ మీడియా సోషల్ మీడియా ఇలా అన్ని మీడియాలను కవర్ చేస్తూ నాని అన్నింటా తానై ఇస్తున్న ఇంటర్వ్యూలు ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారాయి. 

గత సంవత్సరం నాని నటించిన రెండు సినిమాలు ఫెయిల్ అయిన నేపధ్యంలో ‘జెర్సీ’ విజవంతం కాకపోతే నాని మార్కెట్ పై తీవ్ర ప్రభావం చూపించే ఆస్కారం ఉంది. వరసగా ఆరు విజయాలు వచ్చి నానీకి డబల్ హ్యట్రిక్ దక్కడంతో నాని పారితోషికం 10 కోట్ల స్థాయి నుండి 15కోట్లకు చేరిపోయింది. 

ఇలాంటి పరిస్థుతులలో రేపు విడుదల అవుతున్న ‘జెర్సీ’ సక్సస్ కాకపోతే నాని పారితోషికం ఏమాత్రం పెరగదు సరికదా తిరిగి యూటర్న్ తీసుకని తగ్గే పరిస్థుతులు ఏర్పడుతాయి. దీనికితోడు నాని ‘జెర్సీ’ కి సంబంధించి ఒక్క రూపాయి కూడ పారితోషికం తీసుకోకుండా ఈమూవీలో నటించినట్లు వార్తలు వస్తున్నాయి. 

దీనికి కారణం ఈమూవీ కథ నానీకి విపరీతంగా నచ్చడం అని అంటున్నారు. ఈమూవీ ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని పదేపదే నమ్మకంతో నాని చెపుతున్నాడు. ఈమూవీకి వచ్చే లాభాలలో నాని కీలక వాట తీసుకున్న నేపధ్యంలో తన వాటా కింద నాని ఈమూవీ ద్వారా 20-25 కోట్ల లాభం వస్తుందనీ నాని ఆశలు పెట్టుకున్నట్లు సమాచారం. ఇలాంటి లాభాలు నానీకి రావాలి అంటే ‘జెర్సీ’ 100 కోట్ల కలక్షన్స్ సినిమాగా మారాలి అయితే అంత స్థాయిలో ఆశలు ఈమూవీ పై పెట్టుకోవడం అదేవిధంగా ఈమూవీని చైనాలో విడుదల చేస్తూ ఉండటం ఇవన్నీ నాని మితిమీరిన నమ్మకాన్ని సూచిస్తున్నాయి అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి..  


మరింత సమాచారం తెలుసుకోండి: