నేచుర‌ల్ స్టార్ నాని- శ్ర‌ద్ధ శ్రీ‌నాథ్ జంట‌గా న‌టిస్తున్న చిత్రం జెర్సీ. గౌతం తిన్న‌నూరి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ సినిమా ఈ నెల 19న ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది. ఇప్ప‌టికే రిలీజ్ అయిన టీజ‌ర్లు, ట్రైల‌ర్లు సినిమాపై అంచ‌నాలు పెంచేశాయి. గ‌త రెండేళ్ల వ‌ర‌కు వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోయిన నానికి గ‌త రెండు సినిమాలు కెరీర్‌కు స్పీడ్ బ్రేక‌ర్లుగా మారాయి. దీంతో ఈ సినిమాతో నాని హిట్ కొట్టాల‌ని క‌సితో ఉన్నాడు.

Related image

ఇక సినిమాపై ఉన్న అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్టుగానే జెర్సీ ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా బాగా చేసింది. వివిధ రూపాల్లో సుమారు రూ.26కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ చేసింది. సినిమా ట్రైల‌ర్ల‌లో నాని చెప్పే డైలాగ్స్ ప్రేక్ష‌కుల్లో ఆస‌క్తిని రేకెత్తిస్తున్నాయి. యూత్ ఈ టైటిల్‌ను బ‌ట్టి సినిమా ఎప్పుడు వ‌స్తుందా ? అని ఎగ్జైటింగ్‌గా వెయిట్ చేస్తున్నారు. ఇక ఇప్ప‌టి వ‌ర‌కు ఎన్నిక‌ల నేప‌థ్యంలో పెద్ద సినిమాలు లేక‌పోవ‌డం, మ‌రోవైపు స‌మ్మ‌ర్ హాలీడేస్ స్టార్ట్ అవుతుండ‌డంతో జెర్సీకి బాక్సాఫీస్ వ‌ద్ద ప్ల‌స్ కానుంది. 

Related image

ఇక శుక్ర‌వారం జెర్సీకి పోటీగా రాఘ‌వ లారెన్స్ కాంచ‌న‌-3 సినిమా కూడా వ‌స్తోంది. ఇప్ప‌టికే కాంచ‌న‌-1, 2లు బాక్సాఫీస్ వ‌ద్ద వ‌సూళ్ల వ‌ర్సం కురిపించాయి. ఈ క్ర‌మంలో కాంచ‌న‌-3పై కూడా ప్రేక్ష‌కుల్లో ఆస‌క్తి ఉంది. మ‌రి ఒకే రోజు వ‌స్తోన్న ఈ రెండు సినిమాల్లో ఏది పైచేయి అవుతుందో చూడాలి.


ఏరియాల వారీగా జెర్సీ  ప్రీ రిలీజ్ బిజినెస్ : ( రూ.కోట్ల‌లో)
నైజాం,యూఏ - 10 
సీడెడ్    -  3.20
ఈస్ట్  -1.60 
కృష్ణా - 1.45 
గుంటూరు - 1.80
వెస్ట్ - 1.25 
నెల్లూరు - 0.80 
-----------------------------------
ఏపీ + తెలంగాణ = 20.10
-----------------------------------
ఆర్‌వోఐ - 1.90 
ఓవ‌ర్సీస్  -  4 
----------------------------- 
వ‌ర‌ల్డ్‌వైడ్  =  26 కోట్లు
----------------------------- 


మరింత సమాచారం తెలుసుకోండి: