కాంచ‌న సీరిస్‌తో ప్రేక్ష‌కుల‌ను ఉర్రూత‌లూగిస్తోన్న రాఘ‌వ లారెన్స్ ఈ సీరిస్‌లో కాంచ‌న 3తో ఈ శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకు వాలిపోతున్నాడు. ఇప్ప‌టికే ముని, కాంచ‌న‌, గంగ లాంటి హ‌ర్ర‌ర్ సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌ను మెప్పించిన ఈ మాస్ట‌ర్ ఇప్పుడు కాంచ‌న 3తో మ‌రోసారి ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌నున్నాడు. శుక్ర‌వారం ఈ సినిమా థియేట‌ర్ల‌లోకి దిగుతున్నా... ఈ సీరిస్ సినిమాల‌పై ప్రేక్ష‌కుల్లో అంచ‌నాలు ఉన్నా ఎందుకో గాని అనుకున్న హైప్ క్రియేట్ కాలేదు. అటు పబ్లిసిటీ కూడా అంత‌గా లేదు.

Image result for kanchana 3 in telugu

ఈ సీరిస్‌లో గంగ త‌ర్వాత చాలా గ్యాప్ తీసుకుని వ‌స్తోన్న ఈ డ్యాన్స్ మాస్ట‌ర్ కం డైరెక్ట‌ర్ ఈ సారి ఎంత వ‌ర‌కు ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తాడు ? అన్న సందేహాలు అయితే ఉన్నాయ్‌. టీజ‌ర్‌, ట్రైల‌ర్లు అంత‌గా ఆక‌ట్టుకోలేక‌పోవ‌డం ఓ మైన‌స్ అయితే... మ‌ళ్లీ అదే హ‌ర్ర‌ర్ ఫార్మాట్‌లో రొటీన్‌గానే ఈ సినిమా ఉంటుంద‌ని ప్రేక్ష‌కులు భావిస్తున్నారు. ఈ సినిమాకు త‌మిళంలో ఓ మోస్త‌రు క్రేజ్ ఉన్నా తెలుగులో అయితే బ‌జ్ లేదు. పైగా శుక్ర‌వార‌మే నాని జెర్సీ కూడా రిలీజ్ అవుతోంది. 


ఇక ఇప్ప‌టికే ఈ సినిమా ప్రీమియ‌ర్లు చూసిన వారు మాత్రం కాంచ‌న 3లో కొన్ని హైలెట్స్ ఉన్నాయ‌ని చెపుతున్నారు. ఈ సీరిస్ త‌ర‌హా యాక్ష‌న్‌, హ‌ర్ర‌ర్ ఎలిమెంట్స్‌తో పాటు సెంటిమెంట్ కూడా లారెన్స్ బాగానే ద‌ట్టించాడ‌ని అంటున్నారు. ఇక క్లైమాక్స్‌లో వ‌చ్చే విజువ‌ల్స్ సినిమాకే హైలెట్ అట‌. కేవ‌లం మాస్‌ను మాత్ర‌మే మెప్పిస్తే స‌రిపోద‌ని భావించిన లారెన్స్ క‌న్నీళ్లు తెప్పించేలా సెంటిమెంట్ డోస్ వ‌డ్డించాడ‌ట‌.

Related image

కాంచన 2లో నిత్యామీనన్ ఎపిసోడ్ తరహా కంట తడి పెట్టించే గుండెను మెలిపెట్టే సీన్లు ఉన్నాయట.  క్లైమాక్స్‌లో వ‌చ్చే వీఎఫ్ఎక్స్, లారెన్స్ నటన కూడా సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోందట. ఇక ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత ఠాగూర్ మధు తెలుగులో విడుదలచేస్తున్నారు. ఓవ‌రాల్‌గా ప‌క్కా ఊర‌మాస్ ట్రీట్‌గా కాంచ‌న 3 ఉండ‌బోతోంద‌ట‌. మ‌రి తెలుగు ప్రేక్ష‌కుల‌ను ఈ సినిమాతో లారెన్స్ ఎలా మెప్పిస్తాడో ?  మ‌రి కొద్ది గంట‌ల్లో తేలిపోనుంది.




మరింత సమాచారం తెలుసుకోండి: