టాలీవుడ్ లో కొత్త తరం దూసుకొస్తోంది. చిన్న చిన్న లైన్లతోనే అద్భుతాలు ఆవిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా సతీశ్ బత్తుల అనే యువకుడు చేస్తున్న ప్రయత్నం మరో హిట్ సినిమా అవుతుందనిపించేలా ఉంది. తాజగా విడుదలైన ట్రైలర్ అంచనాలు పెంచుతోంది. 


ఇంతకీ సినిమా ఏంటో చెప్పలేదు కదా.. ఆకాశవాణి.. విశాఖపట్నం కేంద్రం.. టైటిల్ తోనే తన స్పెషాలిటీ చూపుకున్న దర్శకుడు సతీశ్ బత్తుల.. శివ, ఉమయ జంటగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ట్రైలర్ చూస్తే ఐడెంటిటీ కోసం ఓ యువకుడు పడుతున్న తపనగా కనిపిస్తోంది. 

సైన్స్ స్టూడియోస్ పతాకంపై మర్రిమేకల మల్లిఖార్జున్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ చిత్ర టైటిల్ పోస్టర్‌ను నిర్మాత రాజ్‌కందుకూరి విడుదలచేశారు. లైన్ చిన్నదే అయినా దాని చుట్టూ థ్రిల్లింగ్ అంశాలతో కథ అల్లినట్టు కనిపిస్తోంది. 

ఇటీవల మజిలీ సినిమాలో హీరో ఫ్రెండ్‌ గా నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేసిన శివ.. ఈ సినిమాతో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాడో.. తాజాగా విడుదలైన టీజర్ చూసి వెంటనే ఇందులో కథాంశాన్ని గెస్ చేసే పరిస్థితి లేదు. తల్లిదండ్రులు.. కొడుకు మధ్య అనుబంధానికి సంబంధించిన కథ హైలైట్ గా ఉంటుందని భావిస్తున్నారు. చూడాలి మరి ఎంతగా ఆకట్టుకుంటుందో.



మరింత సమాచారం తెలుసుకోండి: