‘అలీ తో సరదాగా’ కార్యక్రమంలో రేణు దేశాయ్ తో ఇంటర్వ్యూ ప్రసారమైన తరువాత ఆ కార్యక్రమానికి వచ్చిన రేటింగ్స్ పక్కకు పెడితే అలీ పై విమర్శలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. సాధారణంగా అలీ ఈ కార్యక్రమానికి ఆహ్వానించే సెలెబ్రెటీలను తాను అడిగే ప్రశ్నలతో బాగా కార్నర్ చేస్తూ ఉంటాడు.

అయితే రేణు దేశాయ్ తో అలీ చేసిన ఈ ఇంటర్వ్యూలో వివాదాస్పద విషయాలు ఏమి లేకపోయినా ఎదో విషయాలు రేణు చెపుతుంది అన్న ఆతృతతో ఈ కార్యక్రమానికి విపరీతమైన రేటింగ్స్ వచ్చినట్లు సమాచారం. ఇది ఇలా ఉండగా ఈమధ్యన ఎన్నికల ప్రచారంలో పవన్ అలీ పై చేసిన కామెంట్స్ కు ఘాటైన సమాధానం ఇచ్చిన అలీ తీరును ఇండస్ట్రీలోని చాలామంది ప్రముఖులు కూడ తప్పు పడుతున్నట్లు టాక్.

ముఖ్యంగా అలీ పవన్ లతో సన్నిహితంగా ఉండే ఇండస్ట్రీ ప్రముఖులు కొందరు అలీకి ఫోన్ చేసి అలీ పవన్ పై చేసిన కామెంట్స్ పై వివరణ అడగడమే కాకుండా పవన్ ఆవేశాన్ని తెలిసి ఉండి కూడా ఎందుకు అనవసరంగా పవన్ తో మరింత దూరాన్ని పెంచుకున్నావు అని అడిగినట్లు టాక్. అంతేకాదు మరికొందరు అలీని ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్న పవన్ ను వ్యక్తిగతంగా కలిసి సారీ చెప్పవలసిందిగా సలహా ఇచ్చినట్లు సమాచారం.

ఈవిషయమై అలీకి సన్నిహితుల నుండి ఒత్తిడి పెరిగి పోతున్న పరిస్థితులలో ఆ ఒత్తిడి నుండి తప్పుకోవడానికి అలీ తన కుటుంబ సభ్యులతో అలీ లండన్ వెళ్ళినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే అలీ ఇలా లండన్ వెళ్ళడానికి తన పై వస్తున్న ఒత్తిడి తప్పించు కోవడానికా లేదంటే కొద్ది రోజులు తన భార్య పిల్లలతో విహార యాత్రకా అన్న విషయమై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: