రాజమౌళి కొడుకు కార్తికేయ తన తండ్రి వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా అనేక సినిమాలకు పనిచేయడంతో రాజమౌళి వారసుడుగా కార్తికేయ తయారు అవుతాడు అని చాలామంది భావించారు. ముఖ్యంగా ‘బాహుబలి’ షూటింగ్ సమయంలో కార్తికేయ అన్ని విషయాలలోనూ తానై వ్యవహరించిన తీరు ఆమూవీ యూనిట్ సభ్యుల ప్రశంసలు అందుకుంది. అయితే రాజమౌళికి కార్తికేయను ఒక దర్శకుడుగా తయారు చేయడం కంటే ఒక మంచి నిర్మాతగా సెటిల్ చేయాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. 

ఇలాంటి పరిస్థితులలో కార్తికేయ నిర్మాతగా మారి నిర్మిస్తున్న ‘ఆకాశవాణి’ మూవీ గురించి ఒక ఆసక్తికర విషయం ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలలో హాట్ టాపిక్ గా మారింది. ప్రముఖ నిర్మాత దర్శకుడు గుణ్ణం గంగరాజు కొడుకు అశ్విని గంగరాజు దర్శకుడుగా పరిచయం అవుతున్న ఈమూవీకి కీరవాణి కొడుకు కాలభైరవ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ పరిస్తులలో మంచి అంచనాలు ఉన్న ఈమూవీ నిర్మాణంలో కార్తికేయ రాజమౌళి పద్దతులను ఏమి అనుసరించకుండా ఏకంగా రాజమౌళికే షాక్ ఇచ్చినట్లు టాక్. 

సాధారణంగా రాజమౌళి సినిమాలు అన్నీ అనుకున్న షెడ్యూల్ కు పూర్తికావు. రకరకాల కారణాలతో రాజమౌళి సినిమాలు ఆలస్యం అవుతూ ఉంటాయి. రాజమౌళి ఒకరోజులో పూర్తి చేద్దాము అని అనుకున్న ఒక సీన్ చిత్రీకరణ రెండు మూడు రోజులు పట్టిన సందర్భాలు కూడ ఉంటాయి. అయితే కార్తికేయ మాత్రం ఈసినిమాను మొదట్లో 70 రోజులలో పూర్తి చేద్దామని అనుకుని కేవలం 50 రోజులలోనే ‘ఆకాశవాణి’ ని పూర్తి చేయడం హాట్ న్యూస్ గా మారింది. 

అంతేకాదు ఈసినిమా షూటింగ్ అనేక ప్రాంతాలలో జరగడమే కాకుండా మైనస్ టెంపరేచర్ ఉండే ప్రాంతాలలో కూడ ఈమూవీ షూటింగ్ జరిగినా అనుకున్న సమయం కంటే ఈమూవీ ముందుగా షూటింగ్ పూర్తి చేసుకోవడం రాజమౌళికి కూడ అందని సీక్రెట్ గా మారింది అని అంటున్నారు. రాజమౌళి తన కొడుకును సక్సస్ ఫుల్ నిర్మాతగా చూడాలి అని భావిస్తున్న నేపధ్యంలో తాను తీసే సినిమాల విషయంలో బడ్జెట్ విషయంలోనే కాకుండా కాలం విషయంలో కూడ పొదుపు పాటిస్తూ ఏకంగా తన తండ్రికే పాఠాలు నేర్పే స్థాయికి ఎదిగిపోయాడు అనుకోవాలి..  


మరింత సమాచారం తెలుసుకోండి: