మిమిక్రీ.. అందర్నీ ఆశ్చర్యపరిచి, మైమరపించే నవ్వుల ప్రక్రియ.. ప్రముఖ నటులు, రాజకీయ నాయకులు, సెలబ్రెటీల స్వరాలను అనుకరించే ఈ ప్రక్రియ నచ్చనివారు ఉండరు. అయితే ఈ మిమిక్రీ ఎక్కువ శాతం మగవాళ్ల వాయిస్‌లో చేస్తుంటారు. 


ఎందుకంటే.. సినిమా, రాజకీయం ఈ రెండింటిలోనూ మగవాళ్లదే ఆధిపత్యం ఉంటుంది. కొత్తగా  ఓ అమ్మాయి మాత్రం హీరోయిన్ల గొంతులను అనుకరిస్తూ అందరినీ ఆకర్షిస్తోంది. ఆ అమ్మాయి పేరే ఉదయ శ్రీ. యాంకర్ గా పేరు తెచ్చుకుంటున్న ఈ అమ్మాయి మిమిక్రీలోనూ రాణిస్తోంది.

ప్రముఖ హీరోయిన్లందరి వాయిస్ లనూ దించేస్తోంది. ఇందులో పెద్దగా ఆశ్చర్యపోవాల్సిందేమీ లేదు ... కానీ ఈ అమ్మడు.. రాజకీయ నాయకుల స్వరాలను అనుకరిస్తోంది. ప్రత్యేకించి కేసీఆర్ వాయిస్ ను ఆమె ఇమిటేట్ చేసిన తీరు భలే ఆకట్టుకుంటోంది.

సోషల్ మీడియాలో ఈ వీడియో చక్కర్లు కొడుతోంది. మీరూ చూసేయండి మరి. 



మరింత సమాచారం తెలుసుకోండి: