ఈమధ్య కాలంలో అనేక మీడియాసంస్థలు పవన్ పై నెగిటివ్ కామెంట్స్ ప్రచారంలోకి తీసుకు వస్తున్న నేపధ్యంలో పవన్ లోని పాజిటివ్ యాంగిల్ ను హైలెట్ చేస్తూ రేణు దేశాయ్ ఒకమీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ ను ఒకపత్రిక హైలెట్ చేస్తూ ఆసక్తికర కథనాన్ని ప్రచురించింది. ‘బద్రి’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రేణు దేశాయ్ మొదట్లో తనకు పవన్ తో నటించే అవకాసంపట్ల పెద్దగా ఆసక్తి కనపరచలేదట. 

దీనికికారణం అప్పటికే మోడలింగ్ రంగంలో ఉన్న రేణు దేశాయ్ కి నటనకంటే డైరెక్టర్ గా మారాలి అన్న ఘాడమైన కోరిక ఉండటం. దీనితో దర్శకుడు పూరిజగన్నాథ్ ఎంతో ఒత్తిడి పెడితేకానీ రేణుదేశాయ్ పవన్ తో నటించటానికి అంగీకరించలేదట. అంతేకాదు ‘బద్రి’ మూవీలో రేణుదేశాయ్ పాత్రకు మంచి ప్రాముఖ్యత ఉంటుంది అని పూరి పదేపదే రేణు దేశాయ్ కి చెప్పడంతో తాను పవన్ తో నటించడానికి అంగీకరించానని ఆఇంటర్వ్యూలో రేణు దేశాయ్ చెప్పింది. 

అయితే తనకు టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి వెంకటేష్ నాగార్జున చిరంజీవి వీరు మాత్రమే తనకు తెలుసు అనీ తనకు పవన్ గురించి తెలియదనీ అంటూ ఈసినిమాలో తాను నటించాలి అంటే ముందుగా తాను పవన్ కళ్యాణ్ ను కలిసి తన సందేహాలు తీర్చుకోవాలి అని పూరీకి కండిషన్ పెట్టిందట రేణు. దీనితో షాక్ అయిన పూరి రామానాయుడు స్టూడియోలో ‘తమ్ముడు’ షూటింగ్ లో ఉన్న పవన్ కళ్యాణ్ వద్దకు తీసుకువెళ్ళి పూరి పవన్ కు రేణును పరిచయం చేసాడట. 

ఆషూటింగ్ గ్యాప్ లో నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చి మౌనంగా తన పక్కన కూర్చున్న పవన్ తో తాను మొదటిసారి మాట్లాడుతూ తనకు తెలుగు రాదనీ అందువల్ల టెక్స్ ఎక్కువ తీసుకుంటానని దీనికితోడు తాను హీరోయిన్ మెటీరియల్ కాదని చెపుతూ తనను షూటింగ్ స్పాట్ లో చాల గౌరవంగా చూసుకోవాలి అని రేణు ఏకంగా పూరీకి పవన్ లకు ఇద్దరికీ కండిషన్స్ పెట్టిందట. తాను చెప్పిన మాటలు అన్నీ శ్రద్ధగా నవ్వుతూ విన్న పవన్ ఇంకా ఏమైనా కండిషన్స్ ఉన్నాయా అంటూ తనతో అప్పట్లో జోక్ చేసిన విషయాన్ని గుర్తుకు చేసుకుంది రేణు. అయితే చివరకు అలాంటి వ్యక్తితో తాను ప్రేమలో పడి పెళ్లి చేసుకుంటాను అని తాను మొదటిసారి పవన్ తో కలిసినప్పుడు ఆ ఆలోచనే రాలేదనీ అంటూ అదే డెస్ట్ నీ కాబోలు అంటూ తన పై తానే కామెంట్స్ చేసుకుంది రేణు దేశాయ్..


మరింత సమాచారం తెలుసుకోండి: