నాచురల్ స్టార్ నాని హీరోగా గౌతం తిన్ననూరి డైరక్షన్ లో వచ్చిన సినిమా జెర్సీ. క్రికెటర్ అవ్వాలనుకున్న అర్జున్ కొన్ని కారణాల వల్ల క్రికెట్ కు దూరమై ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు. మళ్లీ 10 ఏళ్ల తర్వాత బ్యాట్ పట్టిన అతను ఏం చేశాడు అన్నది సినిమా కథ. ఈరోజు ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా ఓవర్సీస్ లో ప్రీమియర్స్ నుండి మంచి టాక్ సొంతం చేసుకుంది.


జెర్సీలో నాని నటనకు ఫిదా అవడం ఖాయమట. నాచురల్ స్టార్ కు పర్ఫెక్ట్ సూట్ అయ్యేలా నాని నటన అదిరిపోయిందని తెలుస్తుంది. ఇక గౌతం డైరక్షన్ కూడా చాలా నిజాయితీగా ప్రతిభతో చేశాడట. సినిమా మొత్తం ఎమోషనల్ డ్రామాగా సాగుతుందని తెలుస్తుంది. ట్రైలర్ తోనే సినిమాపై అంచనాలు పెంచిన నాని మొత్తానికి అనుకున్న విజయాన్ని సాధించాడు.


ఒక నటుడికి తను చేసిన సినిమా మీద ఎంత నమ్మకం ఉంటే ఈసారి గట్టి హిట్టు కొడుతున్నామని చెబుతాడు. జెర్సీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నాని పక్కా హిట్టు బొమ్మ ఇదని చెప్పాడు. నాని సినిమా మీద కాన్ ఫిడెన్స్ ఎక్కువైందని అనుకున్నారు కాని సినిమా కథ, కథనాలు అలా ఉన్నాయని సినిమా చూస్తేనే తెలుస్తుంది.


ఇక సినిమాలో నాని, శ్రద్ధా శ్రీనాథ్ ల నటన, క్రికెట్ ను కూడా చాలా జెన్యూన్ గా చూపించారని తెలుస్తుంది. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ సీన్స్ అదిరిపోయాయని తెలుస్తుంది. లాస్ట్ ఇయర్ కృష్ణార్జున యుద్ధం, దేవదాస్ సినిమాలతో నిరాశపరచిన నాని జెర్సీతో మరోసారి తన సత్తా చాటాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: