అందం అంటూ ఉంటే  అన్నీ కప్పుకుని కూడా అట్రాక్ట్ చేయవచ్చునని ఎంతోమంది హీరోయిన్స్ నిరూపించారు. పాత రోజుల్లో అయితే ఒక్క చూపుతో సొగసు జిగేల్మనిపించేవారు. విప్పుకుంటేనే చూస్తారని ఓ తరం అభిప్రాయపడితే ఎన్ని చెప్పుకున్నా అందం ఉంటే చాలు అది ఎలా ఉన్నా కవ్విస్తుందని వొక్కి వక్కాణించే వారు కూడాఇపుడూ  ఉన్నారు. 


కన్నడ కస్తూరి  అనుమప పరమేశ్వరన్ తన అందంతో టాలీవుడ్లో బంధం వేయాలని చూసింది. ఆమెకు మొదట్లో వచ్చిన సినిమాలు అన్నీ ట్రడిషనల్ మూవీసే. అనుపమ సైతం వాటినే ఎంచుకుని డిగ్నిఫైడ్ గా చేసింది. అవి హిట్ అయ్యాయి కూడా ఇక శతమానం భవతి మూవీలో అనుపమను చూసిన ప్రతి తెలుగు గుండె కూడా  మన తెలుగు  ముద్ద మందారమే అనిపించేలా ఉంటుంది. ఆమె కోసం ఓ గ్రామీణ యువకుడు ఆశలు పెంచుకున్న వైనం మొత్తం తెలుగు  యూత్ ని కనెక్ట్ చేస్తుంది.


ఇక ఆ తరువాత అనుపమకు సరైన హిట్లు పడలేదు. పోతినేని రామ్  తో చేసిన రెండు మూవీస్ ఫట్ అయ్యాయి. ఇక కెరీర్ క్లోజ్ అనుకుంటున్న వేళ ఈ ముద్దు గుమ్మ ఇన్స్ట్రాగ్రామ్  ద్వారా తన అందాలను మరో మారు తెలుగింటి ముంగిట ఉంచింది. ఎక్కడా అసభ్యతకు తావు లేకుండా. చక్కగా తనను తాను ఆవిష్కరించుకుంది. ఈ స్టిల్స్ ఇపుడు వైరల్ అవుతున్నాయి.


వీటిని చూసి మళ్ళీ టాలీవుడ్లో చాన్సులు ఇస్తారేమోనని అనుపమ ఆశలు పెట్టుకున్నట్లుంది. మన తెలుగు అమ్మాయిలా ఉండే అనుపమను సినిమాల్లో తీసుకుంటే బాగానే ఉంటుంది, కానీ జిగేల్ రాణీల యుగంలో అనుపమ  పాత చింతకాయ  పచ్చడిలా చీర కట్టు బొట్టుతో ఉందని అనుకుంటే మాత్రం ఆమె సెల్యూలాయిడ్ పై ఇక  ఆశలు వదిలేసుకోవచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: