టాలీవుడ్ లో ఇప్పుడు నాని నటిస్తున్న సినిమాలకు ఎంతో ప్రత్యేకత ఉంటుంది.  భలే భలే మగాడివోయ్ సినిమాలో మతిమరుపు పాత్రతో ఎంతో నేచురల్ గా నటించిన నాని ఆ తర్వాత ప్రేమికుడిగా, పక్కింటి అబ్బాయి లాంటి పాత్రలు పోషించి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు.  ఆ మద్య ద్విపాత్రాభినయంతో వచ్చిన కృష్ణార్జున యుద్ధం, అక్కినేని నాగార్జున లాంటి టాప్ హీరోతో మల్టీస్టారర్ మూవీ దేవదాస్ లాంటి సినిమా నిరాశ పరిచాయి.  దాంతో నాని తన తదుపరి సినిమాపై ఎక్కువ దృష్టి సారించారు. 


ఈ నేపథ్యంలో మరో ప్రయోగాత్మక మూవీ ‘జెర్సీ’తో నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.  ఈ సినిమా మొదటి నుంచి క్రికెట్ నేపథ్యంలో కొనసాగుతున్నట్లు కనిపించినా..ఇటీవల రిలీజ్ అయిన ట్రైలర్ లో ఓ తండ్రి, ప్రేమికుడు పాత్రలు కూడా కనిపించాయి.  గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించగా అనిరుధ్ స్వరాలందించారు. శ్రద్దా శ్రీనాథ్ హీరోయిన్ నటించింది.  ఈ సినిమా ప్రివ్యూ టాక్ చూస్తే.. ఏమోషనల్ సీన్స్ లో అలాగే ఒక క్రికెటర్ గా నాని హావభావాలు ఆడియెన్స్ కి ఈజీగా కనెక్ట్ చేస్తాయట.  ఫస్టాఫ్ మొత్తం రొమాంటిక్ సన్నివేశాలు, చిన్న చిన్న ఎమోషన్స్, కామెడీ సన్నివేశాలతో సాగినా..అక్కడక్కడ కొన్ని బోర్ సిన్లు ఇబ్బంది పెట్టాయట. 


ఇక సెకండ్ ఆఫ్ విషయానికి వస్తే..విపరీతమైన ఎమెషనల్ సీన్లు..ఒక దశలో సెంటిమెంట్ ఎక్కువ వర్క్ ఔట్ చేశారట..సున్నితమైన మనస్కులకు కంట్లో నీరు చెప్పకుండానే వస్తాయని అంటున్నారు.  ఇక సినిమా క్లయిమాక్స్ దశలో మరో లెవెల్ కి తీసుకెళుతుందని అనిరుధ్ తన మ్యూజిక్ తో సినిమాకి ప్రాణం పోశాడని అంటున్నారు.  ఎమెషనల్ డైలాగ్స్,సన్నివేశాలు క్లయిమాక్స్ సీన్ పీక్ స్టేజ్ లోకి తీసుకు వెళ్తుందని అంటున్నారు.  ఏది ఏమైనా చాలా రోజుల తరువాత ఒక మంచి సినిమా వచ్చిందని ఎక్కువ అంచనాలు పెట్టుకోకుండా సినిమా చూడగలిగితే కనెక్ట్ అవుతుందని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: