నేచుర‌ల్ స్టార్ నాని- శ్ర‌ద్ధా శ్రీ‌నాథ్ జంట‌గా గౌత‌మ్ తిన్న‌నూరి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందించిన‌ చిత్రం జెర్సీ. ఓ క్రికెట‌ర్ లైఫ్ అంశాన్ని క‌థ‌గా తీసుకున్నాడు ద‌ర్శ‌కుడు గౌత‌మ్‌. స్పోర్ట్స్ అండ్ ఫ్యామిలీ ఎమోష‌న‌ల్ డ్రామాగా తెర‌కెక్కించిన జెర్సీ సినిమా  శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఇప్ప‌టికే ప్రీమియ‌ర్లు పూర్త‌యిన ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం. సినిమా క‌థ‌లోకి వెళితే న్యూయార్క్ సిటీలో ఉంటున్న అర్జున్‌(నాని) కుమారుడు త‌న తండ్రి( నాని) లైఫ్ గురించి చెబుతుండ‌గా సినిమా ప్రారంభం అవుతుంది. ఎప్పుడో 1996లో నాని త‌న భార్య సారా (శ్ర‌ద్ధా శ్రీనాథ్‌)తో క‌లిసి హైద‌రాబాద్‌లో ఉంటాడు. మంచి ఫామ్‌లో ఉన్న నాని ఆ టైంలోనే క్రిస్టియ‌న్ అయిన సారాను ప్రేమ వివాహం చేసుకుంటాడు. 


సారాతో వివాహం త‌ర్వాత నాని తీవ్ర‌మైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వ‌స్తుంది. తిరిగి 36 ఏళ్ల త‌ర్వాత మ‌ళ్లీ బ్యాట్ ప‌ట్టిన నాని ఎలాగైనా క్రికెట్ ఆడాల‌న్న క‌సితో సాధ‌న చేస్తాడు. చివ‌ర‌కు ఈ జ‌ర్నీలో నాని ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు ?  నాని ఫైన‌ల్‌గా త‌న ల‌క్ష్యాన్ని చేరుకున్నాడా ?  లేదా ? అన్న‌ది వెండితెర‌మీదే చూడాలి. “మళ్ళీరావా” లాంటి ఫీల్ గుడ్ లవ్ స్టోరీని అందించిన గౌతమ్ తిన్ననూరి జెర్సీ సినిమాను చాలీ డీసెంట్‌గా తెర‌కెక్కించాడు. సినిమా ర‌న్ టైం చాలా లెన్దీగా ఉండ‌డంతో సినిమా అంతా సాగ‌దీసిన‌ట్టు ఉంటుంది. 


క్రికెట్ మ్యాచ్‌ల‌ను ద‌ర్శ‌కుడు చాలా స‌హ‌జంగా చిత్రీక‌రించి ప్రేక్ష‌కుల మెప్పుపొందాడు. నాని, శ్ర‌ద్ధ శ్రీ‌నాథ్‌ల మ‌ధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. మ‌ధ్యలో కొంత బోరింగ్‌గా సాగినా.. ఎమోష‌న‌ల్ స‌న్నివేశాల్లో అద్భుతంగా న‌టించారు. అనిరుధ్ నేప‌థ్య సంగీతం సినిమాకు ప్ల‌స్‌. రెండు షేడ్స్‌లో నాని న‌ట‌న సూప‌ర్‌. సినిమాలోని ఎమోష‌న‌ల్ కంటెంట్ ప్రేక్ష‌కుడిని క‌ట్టి ప‌డేస్తుంది. ఇక మైన‌స్‌ల విష‌యానికి వ‌స్తే సినిమా ర‌న్ టైం ఎక్కువ ఉండ‌డంతో పాటు స్లో నెరేష‌న్ కాస్త ఇబ్బంది పెడుతుంది. ఓవ‌రాల్‌గా ఓ క్రికెట‌ర్ ఎమోష‌న‌ల్ జ‌ర్నీయే ఈ జెర్సీ. క్లాస్‌, ఫ్యామిలీ ఆడియెన్స్‌ను మెప్పించే ఈ జెర్నీ మాస్‌ను మెప్పించే తీరును బ‌ట్టి బాక్సాఫీస్ వ‌ద్ద ఏ రేంజ్ హిట్ అందుకుంటుందో ?  చూడాలి.

Image result for nani jersey rievwe

మరింత సమాచారం తెలుసుకోండి: