టాలీవుడ్‌లో ప్ర‌స్తుతం ఒక సినిమా హిట్ అయితే చాలు హీరోలు, టెక్నీషియ‌న్లు రేట్లు ఎలా పెంచేస్తున్నారో తెలిసిందే. అలాంటిది వ‌రుస హిట్ల‌తో ఉన్న వారి రెమ్యున‌రేష‌న్లు అయితే మ‌రీ ఆకాశంలోనే ఉంటాయి. ఇప్పుడు ఈ కోవ‌లోకే వ‌స్తాడు డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి. ప‌టాస్ - సుప్రీమ్ - రాజా ది గ్రేట్ - ఎఫ్ 2 లాంటి నాలుగు వ‌రుస హిట్ల‌తో దూసుకుపోతోన్న అనిల్ రావిపూడి రేటు ఇప్పుడు టాప్ రేంజ్‌లో ఉంద‌న్న గుస‌గుస‌లు ఇండ‌స్ట్రీలో వినిపిస్తున్నాయి.

Image result for maharshi images

సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహర్షి సినిమాలో నటిస్తున్నాడు. ఈసినిమా మే9న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. మహేశ్ సరసన హీరోయిన్ గా పూజా హెగ్డె నటించగా..అల్లరి నరేష్ కీలక పాత్రలో నటించారు. ఈ సినిమాను పీవీపీ- దిల్ రాజు - అశ్వ‌నీద‌త్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా త‌ర్వాత మ‌హేశ్ అనిల్ డైరెక్ష‌న్‌లో ఓ సినిమాలో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే.


నాలుగు వ‌రుస హిట్ల‌తో ఉండ‌డంతో అనిల్ మ‌హేశ్ సినిమాకు తీసుకుంటున్న రెమ్యూనరేషన్ తెలిస్తే షాకవ్వాల్సిందే మరి. అక్షరాల రూ.9 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్న‌ట్టు ఇండ‌స్ట్రీ ఇన్న‌ర్ టాక్‌. అనిల్ తొలి సినిమా ప‌టాస్‌కు కోటి రూపాయ‌ల రెమ్యున‌రేష‌న్ కూడా లేదు. సినిమా హిట్ అయ్యాక క‌ళ్యాణ్‌రామ్ అనిల్‌కు ఊహించిన దానికంటే ఎక్కువ రెమ్యురేష‌నే ఇచ్చాడ‌ట‌. ఆ త‌ర్వాత సినిమాల‌కు మూడు నుంచి నాలుగు కోట్ల వ‌ర‌కు తీసుకున్నాడు. 

Related image

ఇప్పుడు నాలుగు వ‌రుస సూప‌ర్ హిట్ సినిమాలు ఉండ‌డం, దీనికి తోడు ఎఫ్ 2 సినిమా తెలుగు సినిమా ఇండ‌స్ట్రీలోని బిగ్గెస్ట్ హిట్ల‌లో ఒక‌టిగా నిల‌వ‌డంతో పాటు నిర్మాత దిల్ రాజు నుంచి సినిమా కొన్న ప్ర‌తి ఒక్క‌రికి భారీ లాభాలు తెచ్చిపెట్టింది. మ‌నోడి రేంజ్ పెరిగిపోవడంతో దానికి డబుల్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు. మహర్షి మూవీ విడుదల తర్వాత ఈసినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ప్ర‌స్తుతం అనిల్ రెమ్యున‌రేష‌న్ టాలీవుడ్ స‌ర్కిల్స్‌లో బిగ్ హాట్ టాపిక్‌గా మారింది.


మరింత సమాచారం తెలుసుకోండి: