డ్యాన్స్ గ్రూప్ లో ఒకరిగా ఉన్న రాఘవేంద్ర లారెన్స్ లోని టాలెంట్ గుర్తించి అతన్ని డ్యాన్స్ మాస్టర్ గా నిలబెట్టాడు మెగాస్టార్ చిరంజీవి. చిరు, లారెన్స్ ల కాంబోలో ఎన్నో సూపర్ హిట్ స్టెప్పులు వచ్చాయి. ఇంద్రలో వీణ స్టెప్ ఇప్పటికి చాలా పాపులర్ అని చెప్పొచ్చు. తనకు అవకాశాన్ని ఇచ్చిన చిరుని ప్రతి సందర్భంలో గుర్తు చేసుకునే లారెన్స్ కాంచన 3 ఈవెంట్ లో కూడా ప్రస్థావించాడు.


చిరంజీవి గురించి లారెన్స్ చెప్పిన కథ.. ఒకడు నీళ్లల్లో కొట్టుకుపోతూ దేవుడు నన్ను కాపడతాడని అనుకుంటాడు. అయితే అంతలో ఓ పడవ అతను వచ్చి రమ్మని అడుగుతాడు నువ్వు కాదు దేవుడు కావాలని అంటాడు. ఇక మరోసారి ఒకతను ఈదుకుంటూ వచ్చి కాపాడతానని అంటాడు అయినా నువ్వు వద్దు దేవుడు కావాలని అంటాడు.


ఇక ఫైనల్ గా ఒకడు ఫ్లైట్ లో నుండి అతన్ని కాపాడతాడని ట్రై చేసినా సరే నువ్వు కాదు దేవుడు రావాలని అంటాడు. చివరగా అతను చనిపోయి దేవుడు దగ్గరకు వెళ్తాడు. నేను నీళ్లల్లో కొట్టుకుంటుంటే నువ్వు ఎందుకు రాలేదని అంటాడు. దానికి సమాధానంగా ముగ్గురు మనిషి రూపాల్లో వచ్చింది నేనే అంటాడు.


దేవుడిగా నేను కనిపిస్తే నువ్వు తట్టుకోలేవు.. మనిషి రూపంలోనే వస్తా అలా తనకు సంబందించి మనిషి రూపంలో ఉన్న దేవుడు చిరంజీవి అని అంటాడు లారెన్స్. ఇక తన ట్రస్ట్ గురించి తెలియగానే 10 లక్షల డొనేషన్ ఇచ్చారని తన దృష్టిలో దేవుడు అంటే చిరంజీవి అన్నాడు లారెన్స్. చిరుని దేవుడని అంటుంటే అల్లు అరవింద్ క్లాప్స్ కొట్టారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: