టాలీవుడ్ లోకి  ‘సీతాకోక చిలుక’తో బాలనటుడిగా తన కెరీర్ ప్రారంభించిన అలీ అంచెలంచెలుగా పైకి వచ్చి స్టార్ కమెడియన్ గా మారారు.  కమెడియన్ గానే కాకుండా హీరోగా కూడా కొన్ని సినిమాల్లో నటించాడు.  అయితే ఇటీవల టాలీవుడ్ లోకి కొత్త కమెడియన్ల జోరు పెరగడంతో చిన్నగా టెలివిజన్ రంగం వైపు దృష్టి మరల్చారు అలీ.   మూవీ ప్రి రిలీజ్ ఫంక్షన్లకు యాంకర్ గా వ్యవహరించారు..ఆ సమయంలో సహ యాంకర్లపై బూతు మాటలు మాట్లాడి చాలా మందితో చివాట్లు తిన్నాడు.  ప్రస్తుతం కొన్ని ఛానల్స్ కి జడ్జీగా, యాంకర్ గా వ్యవహరిస్తున్నారు.  


ఇటీవల అలీ హోస్ట్ గా వస్తున్న ‘అలీతో సరదగా’ ప్రోగ్రామ్ లో ఎంతో మంది సెలబ్రెటీలను ఇంటర్వ్యూ చేసి వారి ఆంతరంగిక విషయాలు కూడా వెలుగులోకి తీసుకు వచ్చాయి.  అయితే ఇందులో కొన్ని మాత్రం కాంట్రవర్సీలు అయ్యాయి.  తాజాగా పవన్ మాజీ సతీమణి రేణు దేశాయ్ తో చేసిన ఇంటర్వ్యూ లో అలీ పవన్ గురించి కొన్ని పర్సనల్ విషయాలు అడగడం..రేణు దేశాయ్ కూడా వాటికి ధీటైన సమాధానాలు ఇవ్వడంతో ఇప్పుడు పవన్ ఫ్యాన్స్ కి అలీ టార్గెట్ అయ్యారు.  


ఇటీవల అలీ వైసీపీలో జాయిన్ కావడం..పవన్ ఓ సభలో అలీపై వ్యాఖ్యలు చేయగా..దానికి తెల్లవారే అలీ కౌంటర్ ఇవ్వడం ఇలా ఎన్నో జరిగిపోయాయి ఇటీవల కాలంలో..కాగా ఇప్పుడు అలీ చేసిన ఇంటర్వ్యూ తో కొత్త రగడ మొదలైంది.  ఈ ఇంటర్వ్యూతో పవన్ - అలీ మద్య మరింత దూరం పెరిగిపోయిందని..ఈ విషయంలోనే అలీ కాస్త టెన్షన్ కి లోనైనట్టు సమాచారం.  దాంతో ప్రస్తుతం ఆయన విదేశాలకు వెళ్లి కొంత కాలం రిలాక్స్ కావాలని నిర్ణచించుకున్నారట. 


మరింత సమాచారం తెలుసుకోండి: