నాగచైతన్య, సమంత జంటగా నటించిన సినిమా మజిలీ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. మొదటి రోజు నుంచే పాజిటివ్ రెస్పాన్స్ ను స్వంతం చేసుకున్నది. అయితే శివ నిర్వాణ దర్శకత్వంలో వచ్చిన ఈ ఎమోషనల్ లవ్ జర్నీ‌ ప్రేక్షకుల్ని ఫిదా చేసింది. నాగ చైతన్య కెరియర్ బెస్ట్ పెర్ఫామెన్స్ ఇవ్వగా.. సమంత తనదైన శైలి నటనతో ప్రేక్షకుల్ని మెస్మైరైజ్ చేసింది. ఏప్రిల్ 5న విడుదలైన ఈ మూవీ మూడో వారంలోనూ మంచి వసూళ్లతో రన్ అవుతోంది. ఇక ఈ మూవీకి అదనపు హంగుల్ని జతచేస్తూ.. ప్రమోషన్స్ వేగవంతం చేసింది చిత్ర యూనిట్.


 తాజాగా ఈ చిత్రంలోని డిలేటెడ్ సీన్‌ని సోషల్ మీడియా వేదికగా విడుదల చేసింది చిత్ర యూనిట్. హీరో నాగ చైతన్య, విలన్ సుబ్బరాజుల మధ్య ఎమోషనల్‌గా సాగిన ఈ సీన్‌ సినిమాటిక్‌గా అనిపించినప్పటికీ.. ఈ సీన్‌ సినిమాలో ఎక్కడ యాడ్ చేస్తే బావుందనే నిర్ణయాన్ని ప్రేక్షకులకు వదిలేశారు దర్శకుడు. వాస్తవానికి ‘మజిలీ’ చిత్రంలో సుబ్బరాజు పాత్రకు సరైన ముగింపు ఇవ్వలేదనే కామెంట్స్ వచ్చాయి. ఇక క్లైమాక్స్‌లోనూ అతని పాత్ర తేలిపోయింది.


బలమైన సీన్ ద్వారా అతనిలో మార్పు వచ్చేట్టుగా చూపిస్తే బావుండనేది ప్రేక్షకుల్లో ఆలోచన మెదిలింది. వాస్తవానికి ఇదే ఆలోచన దర్శకుడిలోని కలిగిందని ఈ డిలీటెడ్ సీన్ ద్వారా అర్ధమైంది. కత్తితో పొడవాలని కసితో ఎదురుచూసే శత్రువును.. మనస్ఫూర్తిగా గుండెలకు హత్తుకుంటే కోపం చల్లారడమే కాకుండా అతనిలో మార్పును కూడా చూడొచ్చని ఈ ఎమోషన్ సీన్ ద్వారా పండించే ప్రయత్నం చేశారు దర్శకుడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: