'మజిలీ' సూపర్ సక్సస్ లో సమంత నాగచైతన్యల కాంబినేషన్ అత్యంత కీలకంగా మాయచేసింది అన్నది వాస్తవం. వీరిద్దరూ కాకుండా మరెవ్వరైనా హీరో హీరోయిన్స్ 'మజిలీ' కథలో కష్టపడి నటించినా పూర్ణ శ్రావణి పాత్రలలో సమంత చైతన్యలు ఒదిగిపోయినట్లుగా మరెవ్వరు ఆ పాత్రలకు సరితూగరు. 

వీరిద్దరి కలయిక 'మజిలీ' మూవీకి మ్యాజిక్ చేసినా మళ్ళీ అలాంటి మ్యాజిక్ ను వెంటనే రిపీట్ చేసే ఉద్దేశ్యం తమకు లేదు అంటూ అనేకసార్లు సమంత ఇంటర్వ్యూలలో ఓపెన్ గానే చెప్పింది. ఇప్పుడు ఆ అభిప్రాయాన్ని 'ఆర్ ఎక్స్ 100' దర్శకుడు అజయ్ భూపతి కోసం మార్చుకోవాల్సిన పరిస్థితి సమంత చైతన్యలకు ఏర్పడింది అంటూ వార్తలు వస్తున్నాయి. 

తెలుస్తున్న సమాచారం మేరకు దర్శకుడు అజయ్ భూపతి చెప్పిన ఒక పవర్ ఫుల్ స్టోరీ చైతన్య సమంతలకు బాగా నచ్చినట్లు సమాచారం. ఈమూవీలో నాగచైతన్య పాత్ర అతడి కెరియర్ కు మరింత హైక్ ను ఇచ్చే విధంగా అజయ్ భూపతి డిజైన్ చేసినట్లు టాక్. అయితే చైతన్యతో సమానంగా మరో లేడీ పాత్ర ఉన్నట్లు తెలుస్తోంది. 


అయితే ఆపాత్ర సమంత నటిస్తేనే ఆ కథకు న్యాయం జరుగుతోందని అజయ్ భూపతి సమంత పై తీవ్ర ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం చైతన్య నటిస్తున్న 'వెంకీ మామ' సమంత నటిస్తున్న '96' రీమేక్ పూర్తి అయిన తరువాత ఈ మూవీ షూటింగ్ మొదలు పెడదామని అజయ్ భూపతి వీరిద్దరి పై చాలా ఆశలు పెట్టుకున్నట్లు సమాచారం. అయితే చైతన్య అజయ్ భూపతి తీస్తున్న సినిమాకు లైన్ క్లియర్ చేసినా ఇంకా సమంత నుండి ఎటువంటి గ్రీన్ సిగ్నల్ రాలేదు అని అంటున్నారు..



మరింత సమాచారం తెలుసుకోండి: