ఏపీ సీఎం చంద్ర‌బాబు నెత్తిపై మ‌రో పిడుగు ప‌డ‌నుందా? ఇప్ప‌టికే ఆయ‌న‌ను రాజ‌కీయంగా విల‌న్ చేస్తూ.. రామ్‌గోపాల్ వ‌ర్మ తీసిన సినిమా ల‌క్ష్మీస్.. ఎన్టీఆర్ భారీ ఎత్తున తెలంగాణ‌లో దుమ్మురేపుతోంది. ఈ మూవీలో  చంద్ర‌బాబు.. టీడీపీని ఎలా త‌న చేతిలోకి తీసుకున్న‌దీ వ‌ర్మ చూపించారు. అంతేకాదు, ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడ‌వ‌డంపైనా నేరుగా ఓ పాట నే చిత్రీక‌రించారు. ఎన్నిక‌ల ముంగిట ప‌క్కా వ్యూహంతో వ‌ర్మ‌చేసిన ఈ ప్ర‌యోగం.. భారీ స‌క్సెస్ అయింది. అయితే, ఈ మూవీని ఏపీలో విడుద‌ల చేస్తే.. టీడీపీ ఓటు బ్యాంకు గ‌ల్లంత‌వుతుంద‌ని భావించిన చంద్ర‌బాబు నానా ప్ర‌యాస ప‌డి కోర్టు ద్వారా మూవీకి బ్రేకు వేయించారు. దీంతో ఏపీలో మిన‌హా ఈమూవీ సంచ‌న‌లనం సృష్టించింది. 

Related image

మొత్తంగా వ‌ర్మ‌.. చంద్ర‌బాబును పొలిటిక‌ల్ విల‌న్‌ను చేశారు. ఇక‌, ఇప్పుడు మ‌రో బ‌యోపిక్‌కు వ‌ర్మ సిద్ధ‌మ‌య్యారు. తెలం గాణ సీఎం కేసీఆర్ ఉద్య‌మ నేప‌థ్యం, రాజ‌కీయ జీవితం ఆధారంగా ఓ బ‌యోపిక్ చేయాల‌ని నిర్ణ‌యించుకున్నారు. దీనికి అప్పుడే టైగ‌ర్ కేసీఆర్ అనే పేరు కూడా పెట్టారు.  దీంతో ఇప్పుడు టాలీవుడ్‌లో ఈ విష‌యం ఆస‌క్తిగా మారింది. అయితే, ఇప్ప‌టికిప్పుడు ఈ మూవీని తీయ‌డం వెనుక వ‌ర్మ ఉద్దేశం ఏంట‌నే విష‌యంపైనా చ‌ర్చ సాగుతోంది. త‌న ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ మూవీని ఏపీలో విడుద‌ల కాకుండా అడ్డుకున్న చంద్ర‌బాబుకు గ‌ట్టిగా గుణ‌పాఠం చెప్పాల‌ని వ‌ర్మ నిర్ణ‌యించుకున్న‌ట్టు తెలుస్తోంది. ఈ క్ర‌మంలోనే టైగ‌ర్ కేసీఆర్ పేరుతో ఆయ‌న మూవీని ప్రారంభిస్తున్నార‌ని అంటున్నారు. 

Image result for kcr and chandrababu

ఇక‌, ఇప్ప‌టి వ‌రకు ఉన్న అంచ‌నాల ప్ర‌కారం.. ఈ మూవీలోనూ విల‌న్ పాత్ర చంద్ర‌బాబు చుట్టూతానే తిరుగుతుంద‌ని అంటున్నారు. తెలంగాణ విష‌యంలో రెండు నాల్క‌లు, రెండు క‌ళ్ల సిద్ధాంతాన్ని అనుస‌రించిన తీరు, కేసీఆర్ ప‌ట్ల అవ‌మాన‌కరంగా వ్య‌వ‌హ‌రించిన తీరును వ‌ర్మ ఇందులో ఎండ‌గ‌ట్ట‌నున్నార‌ని అంటున్నారు. తెలంగాణ రాష్ట్ర ఉద్య‌మం, సాధ‌న స‌హా అనేక విష‌యాల్లో చంద్ర‌బాబు వివ‌క్ష‌ను కూడా వ‌ర్మ ఈ మూవీలో చూపిస్తార‌ని తెలుస్తోంది. మొత్తానికి ఈమూవీ మ‌రో సంచ‌ల‌నంగా మారుతుంద‌ని అంటున్నారు. ఏదేమైనా ఇప్ప‌టికే ల‌క్ష్మీస్ ఎన్టీఆర్‌తో ప‌రువు పోగొట్టుకున్న చంద్ర‌బాబుకు ఇప్పుడు కేసీఆర్ బ‌యోపిక్ మ‌రింత డ్యామేజీ చేయ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు. మ‌రి వ‌ర్మ త‌న క‌సిని ఇలా తీర్చుకుంటున్నార‌ని చెప్ప‌క‌త‌ప్ప‌దేమో!!


మరింత సమాచారం తెలుసుకోండి: