దాదాపు 13 ఏళ్ల క్రితం వచ్చిన స్టైల్ సినిమా గుర్తుందా.. ఈ సినిమాతో లారెన్స్ మంచి హిట్ కొట్టాడు.. ఆ తర్వాత చాలా ఎత్తుకు ఎదిగాడు.. ముని, ఆ తర్వాత కాంచన సీరీస్‌లతో వరుస హిట్లు కొడుతున్నాడు. తాజాగా కాంచన 3 వచ్చేసింది. 


ఐతే. పాత స్టైల్ సినిమాకు సీక్వెల్ తీయాలని కొందరు నిర్మాతలు అడుగుతున్నారట. ఒకవేళ ఈ సినిమాని తీస్తే ఎవరెవరు స్టార్లు గా ఉండాలి ? ఈ విషయానికి హైదరాబాద్ లో జరిగిన `కాంచన 3` ఈవెంట్ లో లారెన్స్ మాస్టార్ భలే ఇంట్రస్టింగ్ ఆన్సర్ ఇచ్చాడు. 

లారెన్స్ ఏమన్నారంటే.. 
నిర్మాత లగడపాటి శ్రీధర్ తో స్టైల్ సినిమా చేశాను. ఇప్పుడు ఆయనే స్టైల్ 2 చేద్దామంటున్నారు. తప్పకుండా చేస్తాను. డ్యాన్స్ సినిమా చేయాలంటే మంచి డ్యాన్సర్ కావాలి. ఇక్కడ బాగా డ్యాన్స్ చేసే వాళ్లలో బన్ని- చరణ్- తారక్ బాగా చేస్తారు. అన్నయ్య చిరంజీవి గురించి ఈ సందర్భం లో చెప్పలేదని అనుకోవద్దు.. 

ఎందుకంటే ఆయనే అన్నింటికీ బాస్. కాబట్టి స్టైల్ 2 చేసేటప్పుడు పెద్ద హీరోలతో ప్లాన్ చేయాలి అంటూ లారెన్స్ బాంబు పేల్చేశాడు. మరి అల్లు అర్జున్, రాంచరణ్, ఎన్టీఆర్ ముగ్గురూ ఒకే సినిమాలో నటించాలంటే జరిగే పనేనా.. కానీ జరిగితే ఫ్యాన్స్ కు పండగే కదా. ఏమో చూద్దాం లారెన్స్ ఆ కాంబినేషన్ సెట్ చేస్తాడేమో.



మరింత సమాచారం తెలుసుకోండి: