రామ్‌ చరణ్‌ ఇటీవల జిమ్ లో గాయపడిన సంగతి తెలిసిందే. అందుకే కాస్త రెస్ట్ తీసుకుంటున్నాడు. మరి ఇంట్లో ఏం ఖాళీగా ఉండటం లేదు లెండి.. భార్యతో చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు. కుటుంబ జీవితంలో ఆనందాన్ని అనుభవిస్తున్నారు. 


రామ్ చరణ్ లో చాలా కళలున్నాయి. మంచి నటుడే కాదు, మంచి డ్యాన్సర్‌ కూడా. అంతే కాదు.  రామ్ చరణ్‌కు శాస్త్రీయ సంగీతంలో కూడా మంచి పరిజ్ఞానం ఉంది. క్లాసికల్ మ్యూజిక్ నేర్చుకున్నాడట రామ్ చరణ్. ఇంకో విషయం.. రామ్ చరణ్ మంచి కుక్ కూడా. 

ఇంట్లో వీలు దొరికనప్పుడల్లా నచ్చిన ఫుడ్ అందరూ మెచ్చేలా చేసి, మురిపిస్తుంటాడు. రీసెంట్‌గా శ్రీమతి ఉపాసన కొణిదెల కోసం స్వయంగా అదిరిపోయే కాఫీ కలిపి ఇచ్చాడట రామ్ చరణ్. భర్త అంత ప్రేమగా కాఫీ కలిపి ఇస్తే భార్య మురిసిపోదా.. అందుకే దాన్ని అపురూపంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. 

ఫైనల్ టచెస్ బై మిస్టర్ సీ హిమ్‌సెల్ఫ్... నమ్మండి  అదిరిపోయింది.. అంటూ కామెంట్ కూడా చేసారామె. ఈ మిస్టర్ సీ ఏంటంటారా.. చెర్రీని ముద్దుగా మిస్టర్ సీ అని పిలుస్తుంది ఉపాసన. అదీ సంగతి. 



మరింత సమాచారం తెలుసుకోండి: