త్వరలో బిగ్ బాస్ త్రీ సీజన్ ప్రారంభం కాబోతోంది. ఈ షో ఎవరు హోస్ట్ చేస్తారన్నదానిపై ఇంకా క్లారిటీ రాలేదు. ఆ వేట కొనసాగుతూనే ఉంది. మరోపక్క ఇందులో పాల్గొనేదెవరనే అంశంపైనా ఊహాగానాలు చెలరేగుతున్నాయి. 


ఈ షోలో వీళ్లు ఉండొచ్చంటూ కొన్ని పేర్లుసోషల్ మీడియాలో షికార్లు కొడుతున్నాయి. అటాంటి వారిలో సుడిగాలి సుధీర్, రేష్మి ముందువరుసలో ఉన్నారు. ఇంకా... టీవీ నటి హరిత, వరుణ్ సందేశ్, యాంకర్ ఉదయభాను, సింగర్ హేమచంద్ర ఉన్నారు. 

వీరు దాదాపుగా ఫైనల్ అయ్యారట. వీరితో పాటు జబర్దస్త్ పొట్టి నరేష్, టివి ఆర్టిస్ట్ జాకీ, నటుడు కమల్ కామరాజు, రేణు దేశాయ్, గుత్తా జ్వాల, మనోజ్ నందన్, రఘు మాస్టర్, నాగ పద్మిణి, యాంకర్ ప్రదీప్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. 

గత సీజన్‌లో పార్టిసిపెంట్ల జాబితాపై ప్రేక్షకుల్లో అంత సంతృప్తి కనిపించలేదు. ఈ సారి ఆ లోటు లేకుండా కాస్త పేరున్న వారినే తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట. మరి వీరిలో ఎవరు ఫైనల్ అవుతారో.. కొత్తగా ఎవరు జాబితాలోకి వస్తారో.. 



మరింత సమాచారం తెలుసుకోండి: