ప్రతి ఒక్కరికీ ఒక్కో టర్నింగ్ పాయింట్ ఉంటుంది. ఆ టర్నింగ్ పాయింట్ రాకపోతే.. జీవితం అలా నిస్సారంగా సాగిపోతుంది. తన విషయంలోనూ అదే జరిగిందంటున్నాడు యంగ్ హీరో నవీన్ చంద్ర. అందాల రాక్షసి చిత్రంలో విభిన్నమైన పాత్రను పోషించి నటుడిగా మంచి మార్కులే కొట్చేశాడు. 


ఆ తర్వాత కొన్ని చిత్రాలు చేసినా చెప్పుకోదగ్గపేరు రాలేదు. ఆ సమయంలోనే క్యారెక్టర్ ఆర్టిస్టుగా - విలన్ గా కూడా ట్రై చేశాడు. అప్పుడే మనోడి లైఫ్ టర్న్ అయ్యిందట. ఈ విషయం ఇటీవలే తానే నిజాయితీగా చెప్పుకున్నాడు. ఎన్టీఆర్ - త్రివిక్రమ్ ల కాంభినేషన్ లో వచ్చిన 'అరవింద సమేత' చిత్రంలో విలన్ గా నటించే ఛాన్స్ దక్కించుకున్నాడు. 

అరవింద సమేతలో నవీన్ చంద్ర పోషించిన పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది. దాంతో మళ్లీ నవీన్ చంద్రకు అవకాశాలు దక్కుతున్నాయి. రీసెంట్‌గా నవీన్ చంద్ర హీరోగా వేణు మధుకంటి దర్శకత్వంలో ఒక చిత్రం మొదలైంది. ఈ వేదికపైనే నవీన్ చంద్ర ఎన్టీఆర్, త్రివిక్రమ్ చేసిన మేలు గురించి నిజాయితీగా చెప్పుకున్నాడు. 

వరుసగా ఫ్లాప్ లు వచ్చిన సమయంలో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఎన్టీఆర్ మరియు త్రివిక్రమ్ గారు నాకు బాలిరెడ్డి పాత్రను అరవింద సమేత చిత్రంలో ఇచ్చారు. ఆ పాత్రతో మళ్లీ నాకు జీవం వచ్చినట్లయ్యింది.  ఎన్టీఆర్ గారు ఆ సినిమాలో ఛాన్స్ ఇవ్వకుంటే పరిస్థితి ఎలా ఉండేదో ఊహించుకోలేను.. అంటూ భావోద్వేగానికి గురయ్యాడు. 



మరింత సమాచారం తెలుసుకోండి: