‘జెర్సీ’ సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడంతో నాని చాల ఉద్వేగంతో ఉన్నాడు. అతడి కెరియర్ లో చాలా స్పెషల్ మూవీ అనదగ్గ ‘జెర్సీ’ కోసం అతడు పడ్డకష్టానికి సరైన స్పందన ప్రేకషకుల నుండి రావడంతో మంచి జోష్ లో ఉన్నాడు నాని. టాలీవుడ్ సెలెబ్రెటీలు అంతా ఈమూవీ పై ప్రశంసలు కురిపిస్తూ పెడుతున్న ట్విట్స్ ను బట్టి ‘జెర్సీ’ మరొక బ్లాక్ బస్టర్ హిట్ గా మారుతుంది అన్న సంకేతాలు వస్తున్నాయి. ఈమూవీ ప్రమోషన్ లో మొదటి నుంచి నాని ఈమూవీ సక్సస్ పై చాల నమ్మకంతో ఉన్నాడు. 

ఈసినిమాలోని తన క్రికెటర్ పాత్రకోసం నాని రెండు నెలలు క్రికెటర్ గా శిక్షణ తీసుకున్న విషయాన్ని పరిశీలిస్తే అతడి కమిట్ మెంట్ అర్ధం అవుతుంది. ఇలాంటి పరిస్థుతులలో నాని తన కొడుకు అర్జున్ (జున్ను) కు సారీ చెప్పిన విషయం అందరికీ నవ్వును తెప్పిస్తోంది. నానీకి రెండుసంవత్సరాల క్రితం కొడుకు పుట్టాడు అతడి పేరును అర్జున్ అని పెట్టుకున్నా నాని ముద్దుగా తనకొడుకును జున్ను అని పిలుచుకుంటాడు. అయితే ‘జెర్సీ’ సినిమాలో హీరో పాత్రకు అర్జున్ పేరు పెట్టి హీరో కొడుకు పాత్రకు నాని అన్న పేరు పెట్టారు. 

వాస్తవానికి ఈమూవీ కథను వ్రాసినప్పుడే దర్శకుడు గౌతమ్ తిన్న సూరి ఇలా స్క్రిప్ట్ లో హీరో పేరు అర్జున్ అతడి కొడుకు పేరు నాని అని వ్రాసుకున్నాడట. అయితే యాధృశ్చికంగా ఈకథకు నాని హీరోగా ఫిక్స్ కావడం కథలోని పేర్లు నాని నిజ జీవితంలోని పేర్లకు సరిగ్గా సరిపోయాయి. దీనితో తన కొడుకు పేరును తాను తన కొడుకుకు చెప్పకుండా పెట్టుకున్నందుకు నాని సారీ చెపుతున్నట్లుగా డిజైన్ చేయబడ్డ ఒక పోస్టర్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.  

‘మా నాన్న నా పేరును తీసుకున్నాడు’ అని రాసి ఉన్న టి. షర్ట్ తో నాని కొడుకు కనిపిస్తూ ఉంటే నాని సారీ చెపుతున్నట్లుగా అతడి కొడుకును చూస్తున్న ఆ ఫోటో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఏది ఎలా ఉన్నా నాని కోరుకున్న సక్సస్ ‘జెర్సీ’ తో రావడంతో ఇక కలక్షన్స్ ల రికార్డుల పరంగా ఈమూవీ చేయబోయే సంచలనాల గురించి అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు..  



మరింత సమాచారం తెలుసుకోండి: