రామ్ చరణ్ తన గాయం నుండి కోలుకున్నాడు అని సంకేతాలు రావడంతో ‘ఆర్ ఆర్ ఆర్’ టీమ్ మళ్ళీ షూటింగ్ మొదలు పెట్టడానికి రంగం సిద్ధం చేసుకుంటోంది. ఇలాంటి పరిస్థితులలో రాజమౌళి అనుసరిస్తున్న రాజీమార్గాల పై ఆసక్తికర చర్చలు ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాలలో జరుగుతున్నాయి. 

జూనియర్ ఎన్టీఆర్ సరసన ఎంపిక చేసిన డైసీ ఎడ్గార్ జోన్స్ ఈమూవీ ప్రాజెక్ట్ నుండి తప్పుకోవడానికి గల కారణాలు కూడ వెలుగులోకి వస్తున్నాయి. తెలుస్తున్న సమాచారం మేరకు ఆమె రాజమౌళి కోరుకున్న విధంగా బల్క్ డేట్స్ ఇవ్వడానికి నిరాకరించడమే కాకుండా తాను ప్రస్తుతం ఇండియాలో ఎండలు మండిపోతున్న నేపధ్యంలో ఆ ఎండలు వేడి తగ్గి వాతావరణం చల్లబడ్డాక మాత్రమే ఇండియాకు వస్తాను అంటూ రాజమౌళికి ఊహించని సమాధానం ఇచ్చినట్లు గాసిప్పులు వినిపిస్తున్నాయి.

దీనితో రాజమౌళి మరికొందరు హాలీవుడ్ హీరోయిన్స్ ను ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీ ప్రాజెక్ట్ విషయమై సంప్రదించినా వారి స్పందన రాజమౌళి కోరుకున్నట్లుగా లేదని టాక్. దీనితో ‘ఆర్ ఆర్ ఆర్’ కథ విషయమై రాజమౌళి మార్పులు చేస్తున్నట్లు సమాచారం. ఈమూవీ కథలో జూనియర్ ను ప్రేమించే బ్రిటిష్ సుందరి బదులు ఆ స్థానంలో భారతీయ అమ్మాయి ఉండేలా కథలో మార్పులు చేస్తున్నట్లు సమాచారం. 

ఇప్పటికే రచయిత విజయేంద్ర ప్రసాద్ ఈ స్క్రిప్ట్ లో రాజమౌళి కోరిన విధంగా మార్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనితో బ్రిటీష్ బ్యూటీ డైసీ కోసం రాసుకున్న బ్యాక్ డ్రాప్ లో మార్పులు చేసి ఆ స్థానంలో ఒక ఇండియన్ బ్యూటీని పెట్టి ఆ పాత్రను శ్రద్ధా కపూర్ కానీ పరిణితి చోప్రాల చేత నటింప చేసేలా రాజమౌళి ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. డైసీ ఈమూవీ ప్రాజెక్ట్ నుండి తప్పుకోవడం రాజమౌళికి షాక్ ఇస్తే ఆమె ఈమూవీ నుండి తప్పుకోవడం జూనియర్ కు చాల మంచి చేసిందని జూనియర్ డైసీల జంటే ఏమాత్రం బాగుండదు అంటూ తారక్ అభిమానులు మాత్రం జోష్ లో ఉన్నారు..   



మరింత సమాచారం తెలుసుకోండి: