సాధారణంగా ఏ రేంజికి ఎదిగిన ఫిల్మ్ మేకర్స్ కధనే ఎక్కువ ఇంపార్టన్స్ ఇస్తారు తప్ప మిగిలినవవి పెద్దగా పట్టించుకోరు. కొందరు మాత్రం కధతో పాటు కాస్టింగ్ కూడా సరిగ్గా కుదిరే వరకూ ఎక్కడా కాంప్రమైజ్ కారు. అటువంటి వారి సినిమాలు వరస విజయాలు సాధించడం వెనక ఈ కాస్టింగ్ సెలెక్షన్ చాలా కీలకమైన పాత్ర పోషిస్తుందని అంటున్నారు.



బాహుబలి తరువాత ఎస్‌ఎస్ రాజవౌళి అంతే శ్రద్ధగా తెరకెక్కిస్తున్న చిత్రం -ఆర్‌ఆర్‌ఆర్. రామ్‌చరణ్, ఎన్టీఆర్‌ల మల్టీస్టారర్‌గా తెరకెక్కుతోన్న చిత్రంలో ఆలియాభట్, శ్రద్ధకఫూర్‌లు హీరోలతో జోడీ కట్టనున్నారు. శ్రద్ధను తీసుకుంటున్న విషయాన్ని యూనిట్ ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. స్క్రిప్ట్‌లో మార్పులకు జక్కన్న సిద్ధపడ్డాడంటే శ్రద్ధ దాదాపు కన్ఫర్మ్ అయినట్టేనని అంటున్నారు.
 స్వాతంత్య్రానికి ముందునాటి సంఘటనలు చూపించే కథలో తారక్‌కు జోడీగా బ్రిటిష్ నటినే తీసుకోవాలనుకున్నా -ఎదురైన సాంకేతిక ఇబ్బందులను దృష్టిలో పెట్టుకునే ముందు ఎంపిక చేసుకున్న బ్రిటీష్ నటి డైసీని పక్కకు తప్పించారు.



‘ఆర్‌ఆర్‌ఆర్’లో చరణ్ అల్లూరి పాత్ర, తారక్ కొమరం భీమ్ పాత్రల్లో కనిపిస్తారు. అజయ్‌దేవగణ్ కీలక పాత్రలో కనిపించే ఈ చిత్రాన్ని 2020 జూలై 30న ఆడియన్స్ ముందుకు తేనున్నారు. మరి జక్కన చెక్కుతున్న శిల్పం శ్రద్ధ ఎంత బాగా ఉంటుందోన్న ఆసక్తి అందరిలో కలుగుతోంది. ఆమె కోసం జక్కన్న తీసుకుంటున్న శ్రద్ధ ఇపుడు పెద్ద చర్చగా ఉంది. జక్కన్న మనసు పెట్టి చేస్తున్న ఈ మూవీలో శ్రధ్ధ అదిరిపోయే ఎపిరియేన్స్ తో వెండితెరకు కొత్త కళలు  అద్దుతుందని అంటున్నారు. చూడాలి మరి.



మరింత సమాచారం తెలుసుకోండి: